పంచాయతీ కార్యదర్శి చేసిన పనికి ఫిదా అయిన గ్రామస్తులు...!

నల్లగొండ జిల్లా:కన్నబిడ్డలే తల్లిదండ్రుల పట్ల కనీస సానుభూతి చూపని నేటి సమాజంలో దిక్కుతోచని స్థితిలో ఓ వృద్ధురాలి జీవన విధానం చూసి చలించి,ఈ విషయాన్ని తన క్లాస్ మెట్స్ తో వాట్సాప్ గ్రూపులో చర్చించి, మిత్రుల సహకారంతో రూ.10 వేలు జమ చేసి ఆ వృద్ధురాలికి అందజేసి అండగా నిలిచిన ఘటన నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో వెలుగు చూసింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…చింతపల్లి మండలం తీర్మాలపురం గ్రామానికి చెందిన చెట్టిపల్లి ముత్తమ్మ అనే వృద్ధురాలికి ఒక్కతే కూతురు.ఆమెకు 20 ఏళ్ల క్రితం వివాహం చేసింది.

 The Villagers Are Fed Up With The Work Done By The Panchayat Secretary , Pancha-TeluguStop.com

బిడ్డ పెళ్ళైన కొన్నాళ్లకే భర్త అనారోగ్యంతో మరణించాడు.అప్పటి నుండి కూలీనాలీ చేస్తూ భర్త కట్టిన తాటాకుల పూరి గుడిసెలో ఒంటరిగా జీవిస్తుంది.

ఈ మధ్య కురిసిన అకాల వర్షాలకు ఆపూరిగుడిసె శిధిలావస్థకు చేరుకొని ఉండడానికి వీల్లేకుండా పోయింది.పని చేయడానికి శరీరం సహకరించక, ఉండటానికి ఇల్లులేక, తినడానికి తిండి లేక, వృద్ధ్యాప్యంలో కొట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం సాగిస్తున్న ముత్తమ్మను చూసిన గ్రామ పంచాయితీ కార్యదర్శి చందా నాగేంద్ర మానవత్వాన్ని ప్రదర్శించారు.

ఆమె పరిస్థితిని అడిగి,వచ్చే పెన్షన్ డబ్బులు అనారోగ్య సమస్యలకే చాలడం లేదని తెలుసుకొని చలించారు.కూడు,గూడు, గుడ్డ లేని వృద్ధురాలిని చూసి ఏదో ఒకటి సహాయం చేయాలని తన 10 వ తరగతి స్నేహితులకు ఈ సమస్యపై వాట్సాప్ ద్వారా సమాచారం అందించగా అందరూ కలిసి రూ.10 వేలు జమ చేసి గురువారం రెండు వేలతో వంట సామగ్రి,రూ.8000 నగదును చింతపల్లి ఎంపీడీవో సుజాత చేతుల మీదుగా వృద్ధురాలికి అందించారు.గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శి చందా నాగేంద్ర మానవత్వానికి ఫిదా అయ్యారు.ఆమెకు,ఆమె మిత్రులకు అభినందనలు తెలిపారు.ఈ స్థానికులు మాట్లడుతూ వృద్ధురాలి ఇల్లు వర్షానికి దెబ్బతినడంతో ఇంట్లో పడుకునే పరిస్థితి కూడా లేదు.ఉండటానికి చిన్న పూరి గుడిసె నిర్మాణనికి సహాయం కోసం ఎదురుచూస్తుందని,ఎవరైనా మనసున్న మారాజులు సాయం చేయాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube