ప్రత్యేక అధికారుల పాలనలో ఎక్కిరిస్తున్న సమస్యలు

నల్లగొండ జిల్లా:జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ తిరుమలగిరి(సాగర్) మండల కేంద్రం సమస్యలకు నిలయంగా మారిందని,తక్షణమే గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామానికి చెందిన యువత ఎంపీడీవోకి వినతిపత్రం అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎక్కడా అభివృద్ధి జాడలు కనిపించడం లేదని,వీధి లైట్లు లేక చీకట్లో బయటికెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నామని,రోడ్లకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి రోడ్లపైకి వచ్చి నడవడానికి ఇబ్బందికరంగా మారాయని,వీధికుక్కలు దారెంట వచ్చిపోయేవారిపై దాడి చేస్తున్నాయని, వీధుల్లో అక్కడక్కడ మురుగు నీరు చేరి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని వాపోయారు.

 Problems Arising Under The Rule Of Special Authorities , Special Authorities , P-TeluguStop.com

పలుమార్లు గ్రామపంచాయితీ ప్రత్యేక పాలన అధికారి,సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని,నిధులు లేవని చెపుతున్నారని ఆరోపించారు.ఎంపిడిఓ స్పందించి తక్షణమే గ్రామ సమస్యలు పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నల్లబెల్లి జగదీష్,గౌతమ్ రెడ్డి,నవీన్ రెడ్డి,పసుపులేటి నితిన్, నారాయణరెడ్డి,వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube