నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభంలో వరి ఉరి అని ప్రచారం చేసిన కేసీఆర్ ఇటీవలి కాలంలో వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించడం జరుగుతున్నది.మరొకవైపున కేంద్రప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం సమన్వయంతో వ్యవహరించకుండా వీధుల్లో పోరాటాలు చెయ్యడం వైపునే రాజకీయ లబ్ధికోసమే ఆలోచిస్తున్నదని,రైతాంగం యొక్క పరిస్థితి ఏమిటి అనే విషయంలో తగిన విధంగా ఆలోచించడంలేదని, గడువు దాటకముందే,కాలాతీతం కాకముందే, అత్యవసరంగా,తక్షణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి,రైతాంగం పండించిన ప్రతి గింజను కొనేందుకు సిద్ధపడాలని లేనిచో,సాధారణ రైతాంగం వీధుల్లోకి వచ్చి పోరాడకముందే ప్రభుత్వాలు సమన్వయంగా వ్యవహరించాలని,రైతులకు న్యాయం చేయాలని చిట్యాలలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందని ప్రజా పోరాట సమితి (పి.
ఆర్.పి.ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపాటి లక్ష్మి నరసింహ,బీజేపీ జిల్లా నాయకులు కన్నెబోయిన మహలింగం యాదవ్,సీపీఎం జిల్లా నాయకులు నారబోయిన శ్రీనివాస్,సమాచార హక్కు వికాస సమితి నాయకులు బర్రె సంజీవ తెలిపారు.ధాన్య కొనుగోలు కేంద్రాలను తక్షణం ఏర్పాటు చేయాలని పీ.ఆర్.పీ.ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం చిట్యాల మెయిన్ సెంటర్ లో జరిగిన అఖిలపక్ష రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ ఓబీసీ జిల్లా నాయకులు జంపాల వెంకన్న,జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లేశ్,ఏనుగు నరసింహరెడ్డి,పీ.
ఆర్.పీ.ఎస్.జిల్లా నాయకులు ముప్పిడి మారయ్య, పోతెపాక విజయ్,నాగిళ్ళ నరేష్,బెల్లం అశోక్ మరియు రైతులు మెండె నరసింహ,జిట్ట యాదయ్య,జిట్ట చంద్రయ్య,దాసరి లచ్చయ్య,పిశాటి యాదగిరిరెడ్డి,మేకల మల్లయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.