నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్ లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ ను కొంతమంది చిన్నారులు స్విమ్మింగ్ పూల్ అనుకోని కేరింతలతో ఈతలు కొడుతున్న దృశ్యాలు వెలుగు చూశాయి.అసలే వైరల్ ఫీవర్స్ ప్రబలుతున్న తరుణంలో ఇలాంటి వాటర్ లో ఈతలు కొట్టడం వలన పిల్లల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని పలువురు వాపోతున్నారు.
నిత్యం ప్రజలతో, వాహనాలతో రద్దీగా ఉండే క్లాక్ టవర్ సెంటర్ లో ఇలా జరగడం,అక్కడ చూస్తున్న ప్రజలు కానీ, మున్సిపల్ అధికారులు కానీ,వారిని నివారించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.తల్లిదండ్రులు కూడా ఇంత నిర్లక్ష్యంగా పిల్లలను వదిలేయడం ఏమిటని,అది వాటర్ ఫౌంటేక్ కావడంతో ఏదైనా జరగరానిది జరిగితే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.