మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశం

నల్లగొండ జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో శనివారం మలి దశ తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పలువురు ఉద్యమకారులు మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో పాల్గొని అనేక ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కోల్పోయామని,అది గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలంతో పాటు 1969 ఉద్యమకారులకు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తమకు కూడా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 Meeting Of Mali Dasha Telangana Activists, Mali Dasha Telangana Activists, Tela-TeluguStop.com

ఈ కార్యక్రమంలో మలిదశ ఉద్యమకారుల కమిటీ కన్వీనర్ గా పెరిక జయరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.ఈ సమావేశంలో మలి దశ తెలంగాణ ఉద్యమకారులు మాతంగి అమర్,నలుగురు కిరణ్ కుమార్,పెరిక వెంకటేశ్వర్లు,అల్ల పరమేష్,ఎండీ కాసిం, పర్వతం వేణు,కట్ట శీను, రాంబాబు,లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube