రాష్ట్రంలో రానున్నది బీజేపీ పాలనే

నల్లగొండ జిల్లా: భవిష్యత్తులో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని,ఇతర పార్టీలకి చెందిన కార్యకర్తలు బీజేపీకి చేరువ అయ్యేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని,బీజేపీ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వివిధ నిరసన కార్యక్రమాలు చేపట్టి పార్టీని అభివృద్ధి చేయాలని బీజేపి ఎస్సీ మోర్చా నల్గొండ జిల్లా అధ్యక్షులు గోలి ప్రభాకర్ తెలిపారు.శుక్రవారం నార్కట్ పల్లి వాసవి భవన్లో బీజేపీ జిల్లా కార్యదర్శి పోతులపాటి అరుణ అధ్యక్షతన జరిగిన బీజేపీ నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

 What Is Coming In The State Is Bjp Rule-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం నుండి రాష్ట్రానికి అనేక విధాలుగా నిధులు మంజూరు అవుతున్నాయని,తద్వారానే రాష్ట్రం పాలించబడుతుందని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసేదన్నారు.ఏది ఏమైనా రాష్ట్రంలో బండి సంజయ్ నాయకత్వాన బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

దళిత నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో పార్టీ పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ యాదాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి మొగులయ్య,కార్యదర్శి గార్ధసు సురేష్,యాదాద్రి జిల్లా యువమోర్చా అధ్యక్షుడు ఏలూరు శ్యామ్, బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షురాలు అయితగోని అనిత,నియోజకవర్గ మాజీ కన్వీనర్ పాల్వాయి భాస్కర్ రావు,నకిరేకల్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు పల్స శ్రీను గౌడ్,జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడు జిల్లా డాకయ్య,కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి మహాలింగం,మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి చకిలంమెట్ల అశోక్,మాజీ మండల అధ్యక్షులు ముడ్సు భిక్షపతి,చెరుకు రోశయ్య,పుట్ట వెంకన్న, రామ్మూర్తి,మాజీ జిల్లా నాయకులు ఘోషిక వెంకటేశం,బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు పాలడుగు నాగేష్,గున్నల నాగరాజు,లింగాల వీరయ్య, మల్లెబోయిన రమేష,పల్లె వెంకన్న,సోషల్ మీడియా కన్వీనర్ చెరుకు లింగస్వామి,ఎస్సీ మోర్చా నార్కట్పల్లి అధ్యక్షుడు ఏర్పుల లింగస్వామి,గిరిజన మోర్చా మండల అధ్యక్షుడు ఉండ్రాతి నవీన్,కిసాన్ మోర్చా అధ్యక్షుడు గంట దయాకర్ రెడ్డి, రామాచారి,ఎస్సీ మోర్చా నాయకులు చిరుమర్తి రవి, మేడిపల్లి గణేష్,చిన్నెని జానయ్య,కాటపల్లి శ్రీరాములు,కత్తుల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube