నల్లగొండ జిల్లా: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పట్టణ ప్రాంతాల రేషన్ షాపుల్లో సన్నబియ్యం కొరత కనిపిస్తుందని పట్టణ ప్రజలు వాపోతున్నారు.రేషన్ కార్డుదారులు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకుని వెలుసుబాటు ఉండడంతో గ్రామీణ ప్రాంతాలు
మరియు ఇతర ప్రదేశాల నుంచి వలస వచ్చిన వారు పట్టణాల్లో బియ్యం తీసుకోవడంతో ఈ పరిస్థితి దాపురించిందని అంటున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇంకా 31.22.941 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేయాల్సి ఉందని తెలుస్తోంది.







