నల్లగొండ జిల్లా:నకిరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి సురేష్ (44) శుక్రవారం రాత్రి నల్లగొండ పట్టణంలో దారుణ హత్యకు గురయ్యాడు.నల్లగొండ జిల్లా కేంద్రం రామగిరిలోని గీతాంజలి అపార్ట్మెంట్లో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్న సురేష్ పై శుక్రవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో త్రీవంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.