సా....గుతున్న డబుల్ రోడ్డు విస్తరణ పనులు...!

నల్గొండ జిల్లా:జిల్లాలోని నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని వెల్మగూడెం నుండి గుర్రంపోడు మండలంలోని చెపూరు ఎక్స్ రోడ్డు వరకు డబుల్ రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి గత సంవత్సరం ఆగస్టులో పనులు ప్రారంభించారు.కానీ,సదరు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఆరు నెలల నుండి విస్తరణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి.

 Double Road Expansion Works Slowed Down, Double Road Expansion Works , Nalgonda-TeluguStop.com

దీనిపై గతంలో పలుమార్లు వార్తా కథనాలు రావడంతో అప్పటి నుండి ఇప్పటి వరకు రోడ్డు పనులు నత్త నడకన సాగుతున్నాయి.కంకర రోడ్డుపై కనీసం నీళ్ళు కొట్టి రోలర్ తో చదును చేయకపోవడంతో దుమ్ము లేసి ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు.

కాంట్రాక్టర్ స్థానిక ప్రజల అవస్థలు పట్టించుకోకుండా నెలల తరబడి పనులు నత్తనడకన చేస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.ఆరు నెలలుగా రోడ్డు పనులు ప్రారంభించి పూర్తి చేయక పోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని,దుమ్ము ధూళితో నరకయాతన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా స్థానిక ఎమ్మేల్యే, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు విస్తరణ పనులు చురుగ్గా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.ఇదే విధంగా పనులు చేస్తే కాంట్రాక్టర్ కి తగిన బుద్ధి చెబుతామని, అధికారులు కాంట్రాక్టర్ కి మద్దతు ఇస్తే నచ్చినట్టు వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై ఆర్ అండ్ బి ఏఈ మిర్యాలగూడ శ్రీనివాస్ రెడ్డిని వివరణ కోరగా స్థానిక కాంట్రాక్టర్ పలు దిక్కుల్లో పనులు దక్కించుకున్నాడు.దానివల్ల కొంత నిర్లక్ష్యం జరుగుతుంది.

నేను వాళ్ళతో మాట్లాడతా,రోజు నీళ్ళు కొట్టే విధంగా చూస్తానని చెప్పడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube