నల్లగొండ జిల్లా:నాంపల్లి మండల కేంద్రంలో రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా కాలం చెల్లిన చెక్కులను అందజేశారని లబ్ధిదారులు వాపోయారు.దీనిపై నాంపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పూల వెంకటయ్య మాట్లాడుతూ మునుగోడు ఎమ్మెల్యే పంపిణీ చేసే చెక్కులు ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేను రానీయకుండా చేసి,తూతూమంత్రంగా చెక్కులను నిర్లక్ష్యంగా అందజేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు.
మండల అధికారులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని అన్నారు.ఇందులో భాగంగా తుంగపాడుకు చెందిన దామెర బుజ్జమ్మకు కాలం చెల్లిన చెక్కును అందజేయడం జరిగిందన్నారు.
ఆమె ఆ చెక్కును చూసి ఏం చేయాలో తెలియక ఆందోళనలో ఉన్నారని,మండల వ్యాప్తంగా మొత్తం 40 చెక్కులు కాలం చెల్లినవి ఉన్నాయని తెలుస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో గౌరవరం సర్పంచ్ కొమ్ము యాదమ్మ భిక్షం,సీనియర్ నాయకులు నిమ్మల వెంకట్ రెడ్డి,బెగరి గిరి,గాదేపాక వేలాద్రి,వెంకట్ రెడ్డి,పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి,దోటి పరమేష్,గాదేపాక వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.