జ్యోతిష్యశాస్త్రం పైన ఎంతమంది ఎన్నిరకాలుగా విమర్శలు చేసినా, దాన్ని నమ్మేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ వుంది.ఇక ఎన్నో కంపెనీలు వారిని పెంచి పోషిస్తున్నాయి.
ఇక మీడియా సంస్థలైతే చెప్పాల్సిన అవసరంలేదు.జ్యోతిష్యుడు లేని మీడియా ఛానళ్లు లేవనే చెప్పుకోవాలి.
ప్రజలకు వున్న ఇంటరెస్ట్ ని బట్టే జ్యోతిష్యుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ వుంది.ఇక యువత కూడా జ్యోతిష్యశాస్త్రం చదవడానికి మొగ్గు చూపుతుంది.ఈ క్రమంలో ఆన్‌లైన్ జ్యోతిష్య ప్లాట్‌ఫామ్ అయినటువంటి ‘ఆస్ట్రోటాక్’ తన స్థూల ఆదాయాన్ని ఏడాదిలో దాదాపు రూ.400 కోట్లకు రెట్టింపు చేసుకోవాలని నిర్దేశించుకుంది.
ఈ నేపథ్యంలో సుమారు 10వేల మంది జ్యోతిష్యులను తన ప్లాట్‌ఫామ్‌లో చేర్చుకోవాలని అనుకుంటోది.ఈ విషయమై సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ‘పునీత్ గుప్తా‘ తాజాగా ఓ ప్రకటన చేసారు.
మార్కెటింగ్, సాంకేతికత, శిక్షణ, రిలేషన్ షిప్ మేనేజ్‌మెంట్ బృందాలను పెంచడం ద్వారా కంపెనీ ఉద్యోగులను కూడా రెట్టింపు చేసుకోవాలని భావిస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు.వారి వెబ్‌సైట్‌లో ప్రస్తుతం వున్న ట్రాఫిక్‌ను ప్రస్తుత బృందం నిర్వహించలేకపోతోందని, 2022 చివరి నాటికి 10,000 మంది జ్యోతిష్యులతో భాగస్వామి కావాలని చూస్తున్నాము అని అన్నారు.
అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించిన ఈ ప్లాట్‌ఫారమ్, ఇప్పటి వరకు 3 కోట్ల కస్టమర్ సందర్శనలను నమోదు చేసినట్టు సమాచారం.గడిచిన 5 సంవత్సరాలులో వారు 3,500 కంటే ఎక్కువ మంది జ్యోతిష్యుల సేవలను వినియోగించుకున్నారు.ఇప్పుడు డిమాండుని బట్టి వీరిని భారీగా భాగస్వాములను చేసుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.కంపెనీ వార్షిక మార్కెటింగ్ బడ్జెట్ రూ.72 కోట్లు అయితే, సగటున నెలకు రూ.4 కోట్లు మాత్రమే వినియోగించుకోగలుగుతున్నామని చెప్పారు.వార్షిక ప్రాతిపదికన దాదాపు రూ.200 కోట్లు అంటే రోజుకు దాదాపు రూ.55 లక్షల వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు.