సూర్యాపేట జిల్లా:పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని,పాఠ్యపుస్తకాలు వెంటనే అందించాలని డిమాండ్ చేస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో చివ్వెంల మండల కేంద్రంలో ఉపాధ్యాయులు ధర్నా చేస్తుండగా పాదయాత్రగా అక్కడికి చేరుకున్న వైఎస్ షర్మిల ఉపాధ్యాయులకు మద్దతుగా ధర్నాలో కూర్చొని వారికి సంపూర్ణ సంఘీభావం ప్రకటించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీచర్ల పక్షాన వైఎస్సార్ నిలబడ్డాడని,పిల్లల చదువుపట్ల వైఎస్సార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారని గుర్తు చేశారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని,మీరు చేసే పోరాటాలకు మేము సైతం మద్దతిస్తామని భరోసా ఇచ్చారు.