పాల ఉత్పత్తులలో కాల్షియం, ప్రోటీన్ తో సహా శరీరానికి అవసరమైన చాలా పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అందుకే ప్రజలు పాలు, పెరుగు ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు.
అలాగే ఇవి మన శరీరాన్ని బలపరుస్తాయి కూడా.అలాగే శరీరంలో ఉన్న పోషక లోపాన్ని తొలగిస్తాయి.
వేసవికాలంలో పెరుగు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది అని అందరూ భావిస్తారు.అందుకే చాలామంది ఆహారంలో సాధారణ పెరుగు( Curd ) మాత్రమే తీసుకుంటారు.
అయితే పెరుగులో కొన్ని పదార్థాలను కలిపి తీసుకోవడం వలన తక్షణ శక్తి పొందవచ్చు.అంతేకాకుండా శరీరంలోని అలసట కూడా నిమిషాల్లోనే తొలగించుకోవచ్చు.

తెలుగులో ప్రోటీన్స్, విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఫోలిక్ యాసిడ్ లాంటి మూలకాలు ఉంటాయి.పెరుగు తినేటప్పుడు కొన్ని వస్తువులను జోడించి తీసుకోవడం ద్వారా దాన్ని రెట్టింపు ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు.జీర్ణ క్రియ సమస్యలతో బాధపడుతున్నవారు పెరుగులో జీలకర్రను కలిపి తీసుకోవాలి.దీని వలన శరీరంలోని జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే ఆహారం సులభంగా కూడా జీర్ణం అవుతుంది.పెరుగులో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు.
పెరుగు తినేటప్పుడు అందరూ జీడిపప్పు, బాదం, వాల్ నట్స్( Cashews, almonds, wall nuts ) కలిపి తీసుకోవాలి.

పెరుగులో బెల్లం కలిపి తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్( Hemoglobin ) కూడా పెరుగుతుంది.దీనివలన రక్తహీనత కూడా తగ్గుతుంది.ఇక రక్తహీనత లాంటి వ్యాధులు ఉన్నవారు ఈ వ్యాధుల బారిన పడకుండా పెరుగుతో వాటిని నివారించుకోవచ్చు.
అలాగే పెరుగు బెల్లం( jaggery ) కలిపి తీసుకోవడం వలన కడుపులో గ్యాస్, మలబద్దకం, ఆమ్లత్వం లాంటి సమస్యలు దూరం అవుతాయి.పెరుగులో ఎండు ద్రాక్షలు కలిపి తీసుకోవడం వలన ప్రోటీన్, ఐరన్, ఫైబర్, క్యాల్షియం లాంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
అందుకే ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్షను, పెరుగును కలిపి తీసుకోవడం వలన శరీరానికి శక్తి బూస్టర్ అవుతుంది.