బుద్ధ జయంతి వేడుకలు

నల్గొండ జిల్లా:నాగార్జునసాగర్ లోని బుద్ధవనంలో 2566 వ,బుద్ధ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి పురావస్తు పరిశోధకుడు,ప్లీచ్ ఇండియా సీఈవో ఈమని శివనాగిరెడ్డి హాజరై బుద్ధవనాన్ని సందర్శించారు.

 Buddha Jayanti Celebrations-TeluguStop.com

జాతక వనం,స్తూప వనం,చరిత వనం,మహాస్తూపం మ్యూజియాలను తిలకించారు.నాగార్జునకొండపై సింహళీయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన జోగులాంబ గద్వాల జిల్లా అలంపురంలో బుద్ధుని పురాతన ప్రతిమలు ఉన్నాయని తెలిపారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బౌద్ధ అవశేషాల నమోదు కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆలంపురంలోని పాపనాశేశ్వర, సూర్యనారాయణ ఆలయాల్లోని మండపం పైకప్పు రాళ్లపై చెక్కిన బుద్ధుని విగ్రహాలను పరిశీలించినట్లు చెప్పారు.

అవి వెయ్యేళ్లనాటి అమితాభ బుద్ధుని విగ్రహాలుగా గుర్తించామన్నారు.ఈ విగ్రహాలు ఉనికిని గురించి చరిత్ర అధ్యయనకారుడు బీఎస్ఎల్ హనుమంతరావు గతంలో తెలిపారని,వాటిపై సమగ్ర పరిశోధనలో భాగంగా తాను తిరిగి అధ్యయనం చేసినట్లు శివనాగిరెడ్డి పేర్కొన్నారు.

శిల్పరీతి ఆధారంగా అవి క్రీ.శ.10వ శతాబ్దం నాటివిగా గుర్తించామన్నారు.క్రీ.శ.10-11 శతాబ్దం మధ్యకాలంలో వైష్ణవ మతప్రచారంలో భాగంగా ఈ ప్రతిమలను విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటిగా చెక్కి ఉంటారని,వజ్రయాన బౌద్ధంలో ఇలాంటి ప్రతిమా లక్షణాలు కలిగిన బుద్ధుని విగ్రహాలను అమితాభ బుద్దుడంటారని ఆయన వివరించారు.కాగా,నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ హిలాకాలనీలో నిర్మించిన బుద్ధవనం బౌద్ధ పరిమళాలను వెదజల్లుతోందని కర్ణాటకలోని మైసూర్కు చెందిన బౌద్ధ మత గురువులు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube