నల్లగొండ జిల్లా: ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను వేములపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు.ఎస్సై దాచేపల్లి విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వేములపల్లి మండల పరిధిలోని రావులపెంట కామాపల్లె గూడెం మూసి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని
విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకొని అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా డ్రైవర్లు ఓనర్లపై కేసులు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.ఎవరైనా చట్టానికి వ్యతిరేకంగా అక్రమంగా ఇసుకను తరలించినచో వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.