పోలీసుల తీరుతో సెల్ టవర్ పై ఆటో డ్రైవర్ హల్చల్...!

నల్లగొండ జిల్లా:తనపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవడంలేదని ఆరోపిస్తూ నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామ శివారులో సోమవారం ఓ ఆటో డ్రైవర్ సెల్ టవర్ ఎక్కి రెండు గంటల సేపు హల్చల్ చేశాడు.వివరాల్లోకి వెళితే మండలంలోని చెర్వు అన్నారం గ్రామానికి చెందిన చిలుముల చింతాలు వృత్తిరీత్యా ఆటో డ్రైవర్.

 Auto Driver On Cell Tower With Police Behavior , Police Behavior , Auto Driver-TeluguStop.com

గత నాలుగు రోజుల క్రితం తన ఆటోలో ప్రయాణీకులను ఎక్కించుకొని నకిరేకల్ వెళ్తుండగా పట్టణంలో కొంత మంది వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.అదే రోజు చింతాలు నకిరేకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

నాలుగు రోజులైన దాడి చేసి వారిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో అయిటిపాముల గ్రామ శివారులోని జాతీయ రహదారి పక్కన ఉన్న సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.విషయం తెలుసుకున్న కట్టంగూర్ ఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని న్యాయం చేస్తామని నచ్చజెప్పడంతో కిందికి దిగాడు.

దీంతో పోలీస్ సిబ్బంది,స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.చింతాలును నకిరేకల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube