నల్లగొండ జిల్లా :దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని పీఏపల్లి మండల కేంద్రంలోని అక్కంపల్లి బ్యాలెన్స్ రిజర్వాయర్ వాటర్ లెవల్ తగ్గడంతో రిజర్వాయర్ వెనుక భాగంలో అక్రమ ఇసుక దందా యధేచ్ఛగా జరుగుతుంది.అయినా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు కిమ్మనకుండా ఉంటున్నారని,దీనికి అధికార పార్టీకి చెందిన
బడా నేతల హస్తముందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
రిజర్వాయర్ నీటిమట్టం తగ్గడంతో కొందరు వృత్తి ముసుగులో పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో నాణ్యత గల ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి, భారీ ఇసుక డంపులు ఏర్పాటు చేసి,పీఏపల్లి మండల కేంద్రంలోని 50 లక్షల ఎస్డిఎఫ్ నిధులతో మంజూరైన రోడ్డుకి వాడుతున్నారని అంటున్నారు.రిజర్వాయర్ లో అక్రమంగా ఇసుకను తవ్వేస్తుంటే చెరువుకు నీటి నిలువలకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని,ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని ప్రజలు వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని చెరువును కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు.