నల్లగొండ జిల్లా:మాజీ ముఖ్యమంత్రి,బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR ) రేపు నల్లగొండ,సూర్యాపేట( Nalgonda, Suryapet ) జిల్లాల్లో పర్యటించనున్నారు.నీరు లేక ఎండిపోతున్న పొలాలను ఆయన పరిశీలించనున్నారు.
అనంతరం,బాధిత రైతులతో సమావేశం అవుతారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో కేసీఆర్ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.