తెలంగాణ కాంగ్రెస్ లోకి చేరికల పర్వం కొనసాగుతోంది.‘ఆపరేషన్ ఆకర్ష్( Operation Akarsh )’ లో భాగంగా హస్తంగూటికి పలువురు నేతలు చేరుతున్నారు.
ఈ క్రమంలోనే ఇవాళ రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు( K Kesavarao )తో పాటు ఆయన కుమార్తె, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరనున్నారు.అదేవిధంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ నుంచి కడియం అనుచరులు హైదరాబాద్ కు బయలుదేరారు.ఈ నేతలు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) నివాసంలో చేరుకోనున్నారు.అక్కడే వీరికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించనున్నారు.







