నల్లగొండ జిల్లా:నల్లగొండ జిల్లాకు విప్లవాల ఖిల్లా అని పేరు.ఇక్కడ కమ్యూనిస్టుల పతారా ఎప్పుడూ ఎంతో కొంత ఉంటుందంటారు.
ఆ విషయం మరొక్కసారి రుజువైంది.బుధవారం నల్లగొండ జిల్లా మునుగోడు పర్యటనకు వచ్చిన రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి కమ్యూనిస్టుల నుండి ఊహించని విధంగా షాక్ తగిలింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ పోయాయి? ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పెన్షన్ లు గతిలేవు?దళితులకు ఇస్తానని చెప్పిన మూడు ఎకరాల భూమి జాడేది? ఉచిత హామీలు,ఉద్దేర ప్రసంగాలు తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజల యోగక్షేమాలు పట్టవా అని ఏఐవైఎఫ్,సీపీఐ నాయకులు అడుగుతుండగా పోలీసులు వారిని వారించడంతో మంత్రి జగదీష్ రెడ్డి కారెక్కి వెళ్లిపోయారు.అనంతరం ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూడిద సురేష్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా యావత్తు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.
రైతులకు ఎరువులు,పురుగుల మందులు ఇస్తున్నామని చెప్పి మరిచిన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.అర్హులకు డబుల్ బెడ్ రూమ్ లు,రుణ మాఫీలు,రేషన్ కార్డులు,ఇప్పటి వరకు ఉనికే లేదని అన్నారు.చర్లగూడెం రాజర్వాయర్ నందు భూములు కోల్పోయిన రైతులకు ఐదేండ్లు గడిచినా ప్రభుత్వం న్యాయం చెయ్యలేదని,కేవలం గద్దెను ఎక్కడం కోసమే ప్రజలకు నకిలీ హామీలిచ్చి పబ్బం గడుపుతున్నారని విమర్శించారు.ఈ నిరసనలో సిపిఐ కుదాబక్ష్ పల్లి గ్రామ శాఖ సహాయ కార్యదర్శి పొట్ట అశోక్,ఎఐవైఎఫ్ నాయకులు శ్రీనివాస్, మధుకర్,సుభాష్,కుమార్,గణేష్ తదితరులు పాల్గొన్నారు.