నల్లగొండ జిల్లా:గచ్చిబౌలి ఇంటర్నేషనల్ ఫుట్బాల్ స్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్( CM Cup ) రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలలో ( foot ball competition )సోమవారం నల్లగొండ జిల్లా మహిళా జట్టు ఆసిఫాబాద్ జిల్లా జట్టుపై పురుషుల జట్టు మహబూబాబాద్ జట్టుపై విజయం సాధించాయని ఉమ్మడి నల్గొండ జిల్లా ( Nalgonda )ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.
నల్లగొండ జిల్లా మహిళల,పురుషుల జట్లు అద్భుతమైన పోరాటపటిమతో,సమిష్టి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాయని అభినందించారు.