నల్లగొండ జిల్లా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగలకు ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని మాదిగ జేఏసి మునుగోడు నియోజకవర్గ ఇంచార్జి మేడి చంద్రస్వామి డిమాండ్ చేశారు.మునుగోడు మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, ఈ పార్లమెంటు సమావేశంలోనే మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని కోరారు.
ఈ నెల 18,19 తేదీల్లో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద డాక్టర్ పిడుమర్తి రవి ఆధ్వర్యలో జరిగే ధర్నాను విజయతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దండు పరశురాం,పందుల సురేష్, మండల అధ్యక్షులు అందుగుల కృష్ణ, మునుగోడు పట్టణ అధ్యక్షులు జీడిమడ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.