నకిరేకల్ లో మేడే "కారు"చిచ్చు

నల్లగొండ జిల్లా:గత అసెంబ్లీ ఎన్నికల నుండి నివురుగప్పిన నిప్పులా ఉన్న నకిరేకల్ గులాబీ గూడు.మాజీ వర్సెస్ తాజా ఎమ్మెల్యేల మధ్య తారాస్థాయికి చేరిన ఆధిపత్య పోరు.

 May "car" Crashes In Nakirekal-TeluguStop.com

మేడే సందర్భంగా భగ్గుమన్న వర్గపోరు.మేడే కార్యక్రమంలో బాహాబాహికి సిద్ధపడ్డ చిరుమర్తి,వేముల వర్గాలు.

ఇరువర్గాలను అదుపు చేయడానికి పడరాని పాట్లు పడ్డ పోలీసులు.ప్రపంచ కార్మిక దినోత్సవ సంబురాలు నకిరేకల్ గులాబీ శిబిరంలో గుబులు రేపుతున్నాయి.

మేడే సందర్భంగా గులాబీ జెండాను ఎగురవేసి క్రమంలో మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం,తాజా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గాలకు చెందిన నాయకులు,కార్యకర్తలు ఒకే వేదిక దగ్గరకు చేరుకున్నారు.జెండా ఎగురవేసి క్రమంలో ఎవరు జెండా ఎగురవేయాలనే దగ్గర తలెత్తిన వివాదం కాస్త వాగ్వాదంగా మారి మాటల యుద్ధం వరకు వెళ్లాయి.

దీనితో పరిస్థితి అడుపుతప్పే అవకాశం ఉండడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింప చేయడానికి నానా పాట్లు పడ్డారు.గత మూడేళ్ళుగా అధికారిక కార్యక్రమాలతో పాటు అన్ని రకాల పార్టీ వేదికలపై నర్మగర్భంగా వ్యవహరిస్తున్న ఇరు వర్గాల వారి ఆధిపత్య పోరు నేడు మేడే సందర్భంగా బహిర్గతమైంది.

వర్గపోరుకు సై అంటే సై అంటూ దూకుడు ప్రదర్శిస్తున్న చిరుమర్తి,వేముల వర్గాల అంతర్గత విబేధాలు మే డే సందర్భంగా బహిర్గతమవడంతో నకిరేకల్ కారుచిచ్చు రచ్చకెక్కింది.ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య,మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయుల ఘర్షణతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు ఉన్నతాధికారులు అత్యంత గొప్యంగా వారి మధ్య రాజీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube