ప్రైవేట్ విద్యా సంస్థల్లో పర్యవేక్షణ కరవు!

నల్లగొండ జిల్లా:జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీలపై విద్యా శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించిందని బుధవారం బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల్లో అధిక మొత్తంలో ఫీజులు గుంజుతూ విద్యార్థులకు కనీస వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలం చెందారన్నారు.

 Lack Of Supervision In Private Educational Institutions!-TeluguStop.com

ఎక్కడా సరిపడా మరుగుదొడ్లు లేవని,ఉన్న మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉన్నాయని,విద్యార్థులు తాగడానికి ఎక్కడ కూడా మంచినీటి వ్యవస్థ లేదని,ఈ చలికాలంలో స్కూల్, కాలేజీలలో పరిశుభ్రత పాటించకపోవడంతో విద్యార్థులు వివిధ రోగాలకు గురవుతున్నారని,బోధన విషయంలో సరైన అనుభవం ఉన్నటువంటి ఉపాధ్యాయులు లేరని,కనీసం డిగ్రీ కూడా లేనటువంటి వ్యక్తులను ఉపాధ్యాయులుగా నియమించుకొని కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు.విద్యార్థులకు మంచి బోధన అందక ఉత్తీర్ణత సాధించలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల తల్లిదండ్రులను ముక్కుపిండి వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని,కానీ,సరైన భోదన,ఇతర సౌకర్యాలు లేక విద్యార్ధులు నష్టపోతున్నారన్నారు.ఇంత జరుగుతున్నా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్లు,కాలేజీల యాజమాన్యం ఇస్తున్న మామూళ్లకు ఆశపడి మొద్దునిద్ర నటిస్తున్నారని ఆరోపించారు.

లేకుంటే ఎందుకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో పర్యవేక్షణ చేయడం లేదని ప్రశ్నంచారు.ప్రైవేట్ విద్యా సంస్థల్లో వివిధ కల్చరల్ ప్రోగ్రామ్స్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేయడం వలన తలిదండ్రుల మీద భారం పడుతుందని,స్కూళ్ళకు కాలేజీలకు సంబంధించిన ఫీజులు చెల్లిస్తేనే పరీక్ష ఫీజులు తీసుకుంటామని కొత్త నిబంధనలు పెట్టి విద్యార్థుల తల్లిదండ్రులను వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.

ప్రైవేట్స్కూల్స్,కాలేజీలలో ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నా జిల్లాకు సంబంధించిన అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారని అన్నారు.ఇప్పటికైనా జిల్లా విద్యా శాఖ అధికారులు ప్రవేట్ స్కూల్స్,కాలేజీలను తనిఖీ చేసి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube