పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి: బూర్గుల నాగేందర్ మాదిగ

ఢిల్లీ/నల్లగొండ జిల్లా: ప్రస్తుత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీ.

 Sc Classification Bill Should Be Introduced In Parliament Burgula Nagender Madig-TeluguStop.com

ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు ఆయన సంఘీభావం ప్రకటించి మాట్లాడుతూ గత 29 ఏళ్లుగా జరుగుతున్న వర్గీకరణ పోరాటాన్ని మోడీ గుర్తించాలని అన్నారు.

ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగ,మాదిగ ఉప కులాలకు జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు అందుతాయన్నారు.

అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచార సభల్లో ఎస్సీ వర్గీకరణ చేపడతామని ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తున్నాయని మండిపడ్డారు.గత ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోడీ 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తానని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయలేదని విమర్శించారు.

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని, దీనికిగాను అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.దీక్షకు మద్దతు తెలిపిన వారిలో తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం రాష్ట్ర కార్యదర్శి సుక్క అశోక్ మాదిగ, రాష్ట్ర కోశాధికారి మాంకాల శ్రీనివాస్ మాదిగ ,రాష్ట్ర నాయకులు మచ్చ రమేష్ మాదిగ, వేర్పుల మహేష్ మాదిగ, మిర్యాల బాలకృష్ణ మాదిగ,వేర్పుల మహేందర్ మాదిగ, ముతేష్ మాదిగ,సారయ్య మాదిగ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube