నల్లగొండ జిల్లా:గత శనివారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రానికి చెందిన జంగాల నరసింహ రెండు మేకలు చిట్టెంపహాడ్ నుండి సంతకు వస్తున్న మేకల్లో కలిసి తప్పిపోయాయి.మంగళవారం మహిళా కాంగ్రెస్ నాయకురాలు బిరుదోజు యాదమ్మ ఇంటికి మేకలు వచ్చాయి.
వాటిని కట్టేసిన యాదమ్మ స్థానిక పోలీసులకు సమాచారం అందజేసి మేకల యజమాని వివరాలను సేకరించి మంగళవారం రాత్రి యజమాని నరసింహకు అప్పగించి నిజాయితీ చాటుకున్నారు.