నల్లగొండ జిల్లా: అగ్రకుల పార్టీలకు బానిసలం కాదు మహనీయుల వారసులం అంటూ మునుగోడు నియోజకవర్గ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షులు నారపాక అంజి మాదిగ అధ్యక్షతన మంగళవారం చండూరు గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ధర్మ సమాజ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్, మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ మల్గ యాదయ్య,ఇన్చార్జి, ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు జిల్లా వెంకటేష్ మాదిగ,గౌరవ అతిధులు బీసీ సంఘం యువజన నాయకులు అవ్వరి వేణు కుమార్, అమరవీరుల ఆశయసాధన రాష్ట్ర అధ్యక్షులు కోరే సాయిరాం,రజక సంఘం జాతీయ నాయకులు లింగస్వామి ముఖ్యాతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు అన్ని కులాల అభ్యర్థులను ప్రకటించాలని డిమాండ్ చేశారు.
75 ఏళ్ల స్వతంత్ర దేశంలో మునుగోడు నియోజకవర్గంలో అగ్రవర్ణాలే పరిపాలిస్తున్నాయని, రాజకీయ,ఆర్థిక,సామాజిక రంగాలలో మా వాటా మాకు దక్కాల్సిందేనని అన్నారు.ఈ విషయంలో మునుగోడు నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ, మహిళా సంఘాలు, విద్యావంతులు,మేధావులు,ఉద్యోగస్తులు, విద్యార్థులు,జర్నలిస్టులు ప్రజాసంఘాలు,కుల సంఘాలు, ఉద్యమకారులు సమాలోచన చేయాలని కోరారు.బహుజన బిడ్డలారా ఆత్మగౌరమే ఆయుధంగా మలుసుకొని, మన ఓటు మనమే వేసుకుందామని పిలుపునిచ్చారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశం దాదాపుగా ఆరు గంటల పాటు కొనసాగింది.
ఈ కార్యక్రమంలో మహనీయుల పొలిటికల్ ఫ్రంట్ ప్రధాన కార్యదర్శి నెల్లికంటి రాఘవేంద్ర యాదవ్,ఏర్పుల గాలయ్య, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు మాధగోని నరేందర్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల జగన్నాథం గౌడ్,అంబల్ల రవి గౌడ్,నాగిళ్ల మారయ్య,మాల మహానాడు మండల అధ్యక్షుడు మేడి లక్ష్మణ్, రజక సంఘం మండల అధ్యక్షులు నాగిల్ల శంకర్, టీఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు తిప్పర్తి అశోక్, ఎరుకల సంఘం మండల అధ్యక్షుడు కొండ్రెడ్డి యాదయ్య,డిఎస్పీ జిల్లా నాయకులు పొట్టిపాక శ్రీనివాస్,మండల నాయకులు శ్రీశైలం, ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బరిగల అశోక్ తదితరులు పాల్గొన్నారు.