ఏసీబీకి చిక్కిన ఎక్సైజ్ సిఐ

వైన్ షాపు యజమాని నుండి నెల వారి మామూళ్ల దందా.ఏసీబీకి సమాచారం ఇచ్చిన వైన్స్ యజమాని.

 Excise Ci Entangled With Acb-TeluguStop.com

నల్లగొండ జిల్లా:హాలియా ఎక్సైజ్ సీఐగా పని చేస్తున్న యమునాధర్ రావు అవినీతికి పాల్పడుతూ నల్గొండలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.సిఐని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.

హైదరాబాద్ సరూర్ నగర్ లో నివాసం వుండే ఎక్సైజ్ సిఐ యమునాధరరావు నల్లగొండ జిల్లా హాలియాలో విధులు నిర్వహిస్తున్నారు.నాగార్జున సాగర్ హిల్ కాలనీకి చెందిన నూకల విద్యాసాగర్ రెడ్డికి అతని భార్య సునీత పేరుమీద లాటరీ పద్దతిలో తిరుమలగిరి సాగర్ లో వైన్ షాప్ వచ్చింది.

అప్పటి నుండి వైన్ షాపు సక్రమంగా నడవాలంటే నెలకు 25 వేల రూపాయలు ఇవ్వాలని హాలియా ఎక్సైజ్ సిఐ వేధిస్తున్నాడు.ఎట్టకేలకు 8 నెలలకు గాను 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్న విద్యాసాగర్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

ఈ నేపథ్యంలో మంగళవారం నల్లగొండ ఎక్సైజ్ స్టేషన్ వద్ద నల్లగొండ సిఐ వెంకటేశ్వర్లు వాహనంలో డబ్బులు పెట్టాలని హాలియా ఎక్సైజ్ సిఐ చెప్పడంతో అనుకున్న ప్రకారం వైన్స్ యజమాని నల్గొండ ఎక్సైజ్ సీఐ వెంకటేశ్వర్లు వాహనంలో డబ్బులు పెట్టడంతో వాటిని తీసుకుంటున్న హాలియా ఎక్సైజ్ సీఐ యమునాధర్ రావును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.హాలియా సిఐ యమునాధర్ రావు అరెస్ట్ తోపాటు,నల్లగొండ ఎక్సైజ్ స్టేషన్ సిఐ వెంకటేశ్వర్లు వాహనం కూడా సీజ్ చేశారు.

ఇదిలా ఉంటే ఏసీబీ అధికారులు ఏకకాలంలో హైదరాబాద్ లోని కొత్తపేటలో వున్న సిఐ నివాసంలో సోదాలు చేపట్టారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube