తడి దుస్తులను ఇంట్లో ఆరబెడుతున్నారా..? అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

చలికాలం, వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆరోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి.అయితే వీటితోపాటు పిండిన దుస్తులను ఆరబెట్టడం కూడా ఒక పెద్ద సమస్య అని చెప్పవచ్చు.

 Drying Wet Clothes At Home But Do You Know How Dangerous It Is-TeluguStop.com

దుస్తులను బయట ఆరేస్తే త్వరగా ఆరవన్న కారణంతో మనలో చాలామంది ఇంట్లోనే ఆరబెట్టుకుంటూ ఉంటారు.ఎందుకంటే ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేసి ఉంటుంది.

కాబట్టి ఫ్యాన్ కింద దుస్తులను ఆరబెడుతూ ఉంటారు.ఇక బయట సరైన స్థలం లేకపోయినా కూడా చాలామంది ఇంట్లోనే దుస్తులు ఆరబెడుతూ ఉంటారు.

కానీ చాలామందికి ఇలా చేయడం వలన ఆరోగ్యం పై దుష్ప్రభావం పడుతుందని తెలియదు.ఆరబెట్టడానికి, ఆరోగ్యానికి ఏంటి సంబంధం అంటే.

దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంట్లో తడి దుస్తులను వేసినప్పుడు ఇంట్లో తేమ ఎక్కువగా అవుతుంది.

దీని కారణంగా ఫంగస్ తో సహా అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.మరి ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం పై ఇది ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.అయితే చిన్నారుల్లో సైనస్, అల్లర్జీలు, నిమోనియాకు కారణమవుతుంది.అంతేకాకుండా ఊపిరితిత్తుల ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.మాంచెస్టర్‌లోని నేషనల్ ఆస్పెర్‌గిలోసిస్ పరిశోధకులు అధ్యయనం నిర్వహించి మరీ ఈ విషయాన్ని తెలిపారు.దుస్తులను ఇంట్లో ఆరబెడితే గదిలో తేమ 30% ఎక్కువగా పెరిగిపోతుందని, ఇది ఫంగస్ అభివృద్ధికి కారణం అవుతుందని అధ్యయనంలో తేలింది.

అంతేకాకుండా ఇది శ్వాసకోశ ప్రక్రియకు ప్రభావితం చేస్తుందని కూడా నిపుణులు చెబుతున్నారు.

Telugu Wet, Tips-Telugu Health

అయితే ఇంట్లో తడిగుడ్డలు ఆరవేసినప్పుడు దుర్వాసన రాకుండా ఉండాలంటే గదిలో ఒక మూల అగరవత్తులు వెలిగించాలి.కానీ దుస్తుల నుండి దూరంగా వెలిగించాలి.అగరవత్తుల నుండి వచ్చే పొగ అవి త్వరగా ఆరిపోవడానికి సహాయపడుతుంది.

అంతేకాకుండా మంచి వాసన కూడా వస్తాయి.అలాగే ఉతికేటప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ నీళ్లలో వేయాలి.

ఇది ఇంట్లో దుర్వాసన రాకుండా చేస్తుంది.అలాగే దుస్తులకు మృదుత్వాన్ని కూడా ఇస్తుంది.

ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఇంట్లో తడిసిన దుస్తులను ఆరబెట్టాల్సి వస్తే కొన్ని చిట్కాలు పాటించాలి.దుస్తులు తడిగా ఉన్నప్పుడు వాటిలో తేమ స్థాయిని తగ్గించడానికి ఉప్పు మంచి మార్గం అని చెప్పవచ్చు.

గదిలో ఓ మూలన ఉప్పును ఉంచాలి.ఇలా చేయడం వలన ఉప్పు తేమను గ్రహిస్తుంది.

దీని ద్వారా ఫంగస్ కూడా కంట్రోల్ లో ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube