యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్‌ను సందర్శించిన సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా:ముఖ్య‌మంత్రి కేసీఆర్,విద్యుత్ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి,ఆ శాఖ ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి సోమవారం దామరచర్లలోని యాదాద్రి అల్ట్రా మెగా థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నుల‌ను ఏరియల్ వ్యూ ద్వారా ప‌నుల పురోగ‌తిని ప‌రిశీలించారు.నిర్మాణ ప‌నుల వివ‌రాల‌ను ముఖ్య‌మంత్రికి అధికారులు వివ‌రించారు.

 Cm Kcr Visited Yadadri Power Plant-TeluguStop.com

ఫ‌స్ట్ స్టేజ్ యూనిట్ 2లో బాయిల‌ర్ నిర్మాణంలో 82 మీటర్ల ఎత్తులోని 12వ ఫ్లోర్‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను సీఎం నిశితంగా ప‌రిశీలించారు.ఉన్న‌తాధికారుల‌తో కేసీఆర్ స‌మీక్ష చేశారు.2023 డిసెంబ‌ర్ చివ‌రి నాటికి యాదాద్రి ప‌వ‌ర్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసి,విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించాల‌ని అధికారుల‌కు సూచించారు.రాష్ట్రానికి వెలుగులు పంచాల‌ని,ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని జెన్‌కోకు ఆదేశాలు జారీచేశారు.2015లో ఈ ప‌వ‌ర్ ప్లాంట్ ప‌నులు ప్రారంభం కాగా, ఇప్పటికే ప్లాంటులో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి.మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి.5 వేల ఎక‌రాల్లో రూ.29,965 కోట్లతో 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామ‌ర్థ్యంతో 5ప‌వ‌ర్ ప్లాంట్ల‌ను నిర్మిస్తున్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్,ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మిత సబర్వాల్,జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు,రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్,బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ కోటి రెడ్డి,ఎమ్మెల్యేలు భాస్కర్ రావు,కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య,శానంపూడి సైదిరెడ్డి,గాదరి కిషోర్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,బొల్లం మల్లయ్య యాదవ్, నల్ల‌గొండ జ‌డ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జ‌డ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి,జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube