బీర్లు నో స్టాక్,మద్యం అన్ని బ్రాండ్లు దొరకవు...!

నల్గొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా ఏ వైన్స్ షాపు దగ్గరకు వెళ్లినా బీర్లు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని,మద్యం కూడా అన్ని బ్రాండ్లు అందుబాటులో లేవనే మాట వినిపిస్తుందని మద్యం ప్రియులు మనో వేదనకు గురవుతున్నారు.బీర్లు ఎందుకు లేవని అడిగితేఅసలు లోడే రావడం లేదని, మందు కూడా అన్ని బ్రాండ్లు రావడం లేదని సమాధానం వస్తుందని వాపోతున్నారు.

 Beers No Stock, Liquor All Brands Are Not Available...!-TeluguStop.com

నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా అంటే మందుబాబుల నుండి మరొక వాదన వినిపిస్తుంది.వైన్స్ యాజమాన్యం సిండికేట్లుగా ఏర్పడి,అక్రమ సంపాదనే ధ్యేయంగా అధిక ధరలకు బెల్ట్ షాపులకు తరలిస్తూ మద్యం మాఫియా నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

బీర్ల లోడు రాకుంటే జిల్లాలో ఏ మారుమూల ప్రాంతమైన వెళ్ళండి ఏ బ్రాండ్ బీరు, మద్యం కావాలన్నా ఏరులై పారుతున్నాయని,వైన్స్ యాజమాన్యం చెప్పేదే నిజమైతే వైన్స్ షాపుల్లో దొరకకని అన్ని బ్రాండ్లు బెల్టు షాపుల్లో ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.కింగ్ ఫిషర్ బీరు,ఐబి,ఓసి,రాయల్ స్టాగ్ లాంటి అధిక డిమాండ్ ఉన్న మద్యం బ్రాండ్లను వైన్స్ షాపులలో విక్రయించకుండా సైజును బట్టి రూ.20 నుండి రూ.100 వరకు అదనంగా తీసుకొని,బెల్టు షాపులకు సరఫరా చేసి అక్రమ సంపాదనకు తెరలేపారనిబహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇంత బహిరంగంగా మద్యం మాఫియా రెచ్చిపోతుంటే సంబంధిత అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని, ఈ అక్రమ సంపాదనలో వారికి కూడా వాటా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఉన్నారని మండిపడుతున్నారు.అంతేకాదు సందిట్లో సడేమియాలాగా బెల్టు షాపు యజమానులు ఇతర మండలాల నుండి ఎమ్మార్పీకి మద్యం తెచ్చిఅధిక రేట్లకు( High rates ) అమ్ముతూమందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారనిఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమయంలో వైన్స్ షాపు యజమానులు ఎలాంటి అనుమతులు లేకున్నా బెల్టు షాపులపై దాడులు చేసి,ఇతర మండలాల నుండి తెచ్చిన మద్యం గుంజుకుపోతున్నట్టు, కేసులు కూడా చేయిస్తున్నట్లుసమాచారం.ఇదే విషయమై ఇటీవల కొన్ని ప్రాంతాల్లో వైన్స్ షాపు యజమానులకు,బెల్టు షాపు యజమానులకు మధ్య వివాదాలు తలెత్తినట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి.

ఇంత జరుగుతున్నా సంబధిత ఎక్సైజ్ శాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సిరియస్ గా తీసుకోకపోవడంతో అటు వైన్స్ యాజమాన్యం,ఇటు బెల్ట్ యాజమాన్యం ఆడిందే ఆట పాడిందే పాటగా అక్రమ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని,దీనితో అందరూ మంచిగా ఉన్నారని, మందు బాబుల ఇళ్లు,వళ్లు గుళ్లవుతుందని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి వైన్స్ షాపుల అక్రమ వ్యాపారానికి అడ్డుకట్ట వేయాలని,అన్ని రకాల మద్యం అందుబాటులో ఉండేలా చూడాలని,బీర్ల కొరతపై క్లారిటీ ఇవ్వాలని మద్యం ప్రియులు కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube