నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలల పునఃప్రారంభ కార్యక్రమం ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District ) వ్యాప్తంగా పండుగ వాతావరణంలో కొనసాగింది.ప్రొపెసర్ జయశంకర్ అమ్మ ఆదర్శ పాఠశాల బడిబాట కార్యక్రమాలతో చదువుల జాతర జరిగింది.
ఈ కార్యక్రమాల్లో వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మూడు జిల్లా కలెక్టర్లు,విద్యా శాఖ అధికారులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో పిల్లలకు యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు,కలెక్టర్లు,స్థానిక ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Chief Minister Revanth Reddy) నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో సెమి రెసిడెన్షియల్ విధానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తూ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడం లక్ష్యంగా ముందుకెళుతుందన్నారు.
ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించి భాగస్వాములు అవ్వాలని కోరారు.పిల్లల పట్ల ఉపాధ్యాయులు పూర్తి శ్రద్ధ పెట్టి,విద్యతో పాటు క్రమశిక్షణ, ఆటపాటలతో అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు.
మధ్యాహ్న భోజనపథకంలో అన్ని జాగ్రతలు తీసుకొని,పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందివ్వాలని,విద్యాశాఖ అధికారులు,ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు.