నల్లగొండ హస్తం పార్టీలో డబుల్ ట్రబుల్...!

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్గొండ కాంగ్రెస్ లో టికెట్ల ఖరారు ఇబ్బందికరంగా మారింది.ఒకే కుటుంబానికి చెందిన ముఖ్యనేతలు రెండు టికెట్లు ఆశిస్తుండటంతో హైకమాండ్ ఎలాంటి నిర్ణయంతో ముందుకెళ్లబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.

 Double Trouble In Nalgonda Hastam Party , Nalgonda , Jayveer Reddy, Congress, Tp-TeluguStop.com

ఈ ఏడాది చివరలో జరగనున్న ఎన్నికలకు తమ అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ ఊపుమీదుండగా కాంగ్రెస్ ఇంకా దరఖాస్తుల ఒడపోతలోనే ఉంది.కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వారి నుంచి టీపీసీసీ నాయకత్వం ఇప్పటికే దరఖాస్తుల స్వీకరించింది.

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 130 అప్లికేషన్లు అందాయి.అదే ఇపుడు పెద్ద సమస్యగా మారింది.

టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంటే మరోవైపు ఒకే కుటుంబానికి చెందిన వారు రెండు టికెట్లు ఆశిస్తున్నారు.తెలంగాణలో ఈ సారి కాంగ్రెస్ అనుకూల పవనాలు వీచుస్తున్నాయని భావిస్తున్న తరుణంలో ఆ పార్టీ శ్రేణులు టికెట్లపై ఆశలు పెట్టుకున్నారు.

అందుకే ఇబ్బడి ముబ్బడిగా టికెట్లకు దరఖాస్తు చేసుకున్నరు.మరోవైపు జానారెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు టికెట్లు ఆశిస్తున్నారు.

నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి ఈ సారి జానారెడ్డి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోలేదు.కానీ,ఆయన రెండో తనయుడు జయవీర్ రెడ్డి( Jayveer Reddy ) టికెట్ ఆశిస్తున్నారు.

మరోవైపు జానారెడ్డి పెద్ద కొడుకు రఘువీర్ రెడ్డి మిర్యాలగూడెం నుంచి టికెట్ కోరుతూ అప్లికేషన్ పెట్టుకున్నారు.అదే మాదిరిగా హుజూర్ నగర్ నుంచి నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన సతీమణి ఎన్.పద్మావతీ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.ఉన్న పన్నెండు సీట్లలో మూడు రిజర్వుడు నియోజకవర్గాల పోతే మిగిలేది తొమ్మిది స్థానాలు.

ఇందులో ఒక్కో కుటుంబానికి రెండేసీ టికెట్లు కేటాయిస్తే నాలుగు పోగా మిగిలేది కేవలం అయిదంటే అయిదే జనరల్ సీట్లు.ఇలాంటి పరిస్థితుల్లో అర్హులైన ఆశావహులకు ఎలా అవకాశాలు కలిపిస్తారన్న ప్రశ్న ఎదురవుతోంది.

ముందు నుంచీ నల్లగొండ కాంగ్రెస్( Congress ) లో ఒక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో నాయకుడి ప్రభావంలో కనీసం రెండు నియోజకవర్గాలు ఉంటూ వచ్చాయి.

వీరిని కాదని అక్కడ అభ్యర్థులను ఖరారు చేయలేని పరిస్థితులు ఉండేవి.ఇప్పటికీ అదే పరిస్థితి కనిపిస్తోంది.చివరకు జిల్లాలోని రెండు ఎస్సీ,ఒక ఎస్టీ రిజర్వుడు స్థానాల్లో సైతం సీనియర్ నాయకులను కాదని అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించే సాహసం చేయలేకపోయారు.2023 అసెంబ్లీ ఎన్నికల కోసం దరఖాస్తులు స్వీకరించినా స్థానిక సీనియర్ నాయకుల మాటను కాదనలేరన్న అభిప్రాయం ఉంది.నాగార్జున సాగర్ నుంచి సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న కె.జానారెడ్డి ఇటు నాగార్జున సాగర్ తో పాటు,మిర్యాలగూడెం, దేవరకొండలపై పట్టు ఉంది.టీపీసీసీ మాజీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి( TPCC Chief N.Uttam Kumar Reddy ), కోదాడ,హుజూర్ నగర్, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి సూర్యాపేటతో పాటు తుంగతుర్తి నియోజకవర్గాలు, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ,నకిరేకల్ అసెంబ్లీ స్థానాలపై పట్టు పెంచుకున్నారు.దివంగత సీనియర్ నాయకుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డికి భువనగిరి,ఆలేరు నియోజకవర్గాలపై అజమాయిషీ ఉండేది.ఆయన మరణానంతరం కొన్నాళ్ల తర్వాత ఇపుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాటే అక్కడ చెల్లుబాటు అవుతోంది.

ఒక్క మునుగోడు మినహా ఇలా ప్రతీ సీనియర్ నాయకుని కనుసన్నల్లోనే రెండేసి నియోజకవర్గాలు ఉండేవి.ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతుండగా చివరకు ఆయా పార్టీల నుంచి చేరికల విషయంలోనూ ఈ నాయకులను కాదనలేక పోతున్నారు.

గత ఏడాది మేలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో జరిగిన ఏఐసీసీ చింతర్ శిబిర్ లో ఉదయ్ పూర్ నవ సంకల్ప్ పేర విడుదల చేసిన డిక్లరేషన్ లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంది.దీని ప్రకారం ఒకే కుటుంబానికి టికెట్లు ఇవ్వరు.

ఒక వేళ అయిదేళ్లకు పైబడి పార్టీలో కొనసాగుతున్నట్లయితే వారు టికెట్ కు అర్హులు అవుతారు.ఈ డిక్లరేషన్ ప్రకారం ఉత్తమ్ దంపతులు రెండు టికెట్లకు అర్హులు అవుతారు.

ఈ లెక్కన జానారెడ్డి తనయుల్లో ఒక్కరికే టికెట్ వస్తుంది.ఒక వేళ జానారెడ్డికే టికెట్ కేటాయించాల్సి వస్తే ఇద్దరు కొడుకలకూ నిరాకరించాల్సిందే.

ప్రస్తుతం ఈ అంశమే జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.ఇంకోవైపు కొందరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముందస్తు వ్యూహంతోనే ఆయా నియోజకవర్గాల్లో తమ దగ్గరి అనుచరులతో ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు ఇప్పించారని అంటున్నారు.

నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని నిజంగానే కొత్త వారికి టికెట్ కేటాయించే పరిస్థితి లేకున్నా ఆయన ప్రోత్సాహంతోనే పలువురు నాయకులు దరఖాస్తు చేసుకున్నట్లు చెబుతున్నారు.ఇదే తరహాలో తుంగతుర్తి నియోజకవర్గంలో కూడా జరిగిందని,మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి తన అనుచరులతో దరఖాస్తులు పెట్టించారని అంటున్నారు.చివరకు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరు అవుతారన్న ప్రశ్నల చుట్టూ చర్చలు జరుగుతున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube