దందాల రాజ్యం దళారుల భోజ్యం

మాఫియా దర్జా,పర్మిషన్ గోరంత కొల్లగొట్టేది కొండంత ఇసుకాసుర వధ తప్పదు.ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోరా ?తరలిపోతున్న ఇసుక దందాను నిలిపివేయాలి బోసన్న బహిరంగ లేఖ.అక్రమ ఇసుకను అడ్డుకున్నందుకు హత్యలు,వాగు వాగులో ఇసుకాసురులు.ముప్పై లారీలు,అరవై ట్రాక్టర్లుగా వర్ధిల్లుతున్న ఇసుక దొంగలను ఇకనైనా శిక్షించండి.

 The Kingdom Of Dandala Is The Food Of The Soldiers-TeluguStop.com

సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేసిన కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ బోరన్న.

తెలంగాణ రాష్ట్రంలో నదులు,వాగులు,వంకలు, జలాశయాల్లో దొరికే ప్రకృతి సంపద సమస్తం అక్రమార్కుల పరమవుతోందని ప్రజా బంధువు అవార్డు గ్రహీత,కమ్యూనిస్టు పార్టీ సిపిఐ (ఎం-ఎల్) రాష్ట్ర కార్యదర్శి బోర సుభాషన్న ఆవేదన వ్యక్తం చేశారు.

అనుమతుల ముసుగులో గోరంతగా,అడ్డగోలుగా కొండంతగా మొత్తంగా ఇసుక దొంగల ముఠాలకు ఇసుక రూపంలో కాసుల వర్షం కురుస్తుందని బోరన్న ఆరోపించారు.కొన్నిచోట్ల రాత్రిపూట గుట్టుచప్పుడు కాకుండా తరలించుకు పోతుండగా,మరికొన్ని చోట్ల పట్టపగలే వాగులను ఊడ్చేస్తున్నారని ముఖ్యమంత్రి కెసిఆర్ కు రాసిన బహిరంగ లేఖలో ఆరోపించారు.

ప్రజాహితాన్ని కోరుకునే ప్రజా నేస్తం కామ్రేడ్ బోర సుభాషన్న ఫోన్ నెంబర్:9848540078 పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల ఆదాయం వస్తుండడంతో అడ్డుకున్న వారిపై దాడులకు పాల్పడుతున్నారని,కొన్నిచోట్ల ఇసుక దందాను అడ్డుకున్నందుకు లారీలతో తొక్కించేస్తూ హత్యలు సైతం చేస్తున్నారని ప్రజా ఉద్యమకారుడు బోరన్న పేర్కొన్నారు.చాలాచోట్ల ఇసుకను అడ్డుకున్న వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వేగంగా ట్రాక్టర్లు లారీలు వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకుడు న్యాయవాది అన్నెపర్తి జ్ఞాన సుందర్ ఫోన్ నెంబర్ 9951242221,8500422221 తుంగతుర్తి కోర్టులో తనకి చెప్పిన విషయాలను బహిరంగ లేఖ ద్వారా సీఎం కెసిఆర్ దృష్టికి తీసుకొచ్చారు.

ప్రజా ఉద్యమ వాది బోర సుభాష్ చంద్రబోస్ నేతాజీ.మహబూబ్నగర్,నాగర్ కర్నూల్ జిల్లాల పరిధిలోని దుందుభి వాగు నుంచి వర్షాకాలం మినహా ఏడాది పొడవునా ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని పి.యు.సి.ఎల్ ప్రజా సంఘం నాయకుడు డాక్టర్ ఎన్ వి శివాజీ ఫోన్ నెంబర్ 9908247532, 8034376121 కేతేపల్లి గ్రామంలో తనకి చెప్పిన విషయాలను కెసిఆర్ కి వివరిస్తూ మిడ్జిల్, తిమ్మాజీపేట మండలంలో ఒక నాడు ఒకటీ,రెండు ట్రాక్టర్లతో ప్రారంభమై,నేడు వందలాది వాహనాలతో దుందుభి వాగు నుంచి నిరంతరాయంగా ఇసుక అక్రమంగా తరలిపోతున్న ఈ విషయాన్ని సి.పి.టి .ఎం.ఏ కార్యదర్శి పులిజాల గెలవయ్య ఫోన్ నెంబర్ : 9666672111 చెప్పిన విషయాలను బోరన్నా గుర్తు చేశారు.అడ్డొచ్చిన వారిపై అడ్డంగా దాడులు, దౌర్జన్యాలు కొనసాగుతుండడంతో ఇసుక అక్రమంగా తరలిపోతున్నా,ఇసుక దొంగల దాడుల భయంతో ప్రజలెవరూ ఇసుకాసురుల వైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి దాపురించిందని భారతీయ గ్రామీణ చైతన్య సంఘం నాయకుడు బోర జైహింద్ భారత్ రాజా మహర్షి సర్దార్ పటేల్ బి.జె.ఆర్ ఫోన్ నెంబర్: 9849779945 చెప్పిన విషయాలను బహిరంగ లేఖలో పేర్కొన్నారు.అక్రమంగా ఫిల్టర్ ఇసుక రవాణా చేస్తున్న లారీని ఆపే ప్రయత్నం చేసినందుకు మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలం తిరుమలాపూర్ సమీపంలో నరసింహులు యాదవ్ అనే యువ రైతు ఉద్దేశపూర్వకంగానే తొక్కించి, చంపేసి చివరకు రోడ్డు ప్రమాదం కేసుగా నీరుగార్చారని బీ.సీ సంఘం నాయకురాలు భాగ్యలక్ష్మి ఫోన్ నెంబర్ :9550194942, 852305547155 బాధపడుతున్న విషయాలను బహిరంగ లేఖలు కెసిఆర్ దృష్టికి తెచ్చారు బహుజన నేస్తం బోర సుభాషన్న.గద్వాల జిల్లా తుంగభద్ర నదీ తీరంలో తవ్వకం దారులు మాఫియాగా తయారయ్యారని,వారానికోసారి తుంగభద్రా నదీ తీరంలో తవ్వకం దారుల మధ్య గొడవలు జరగడం రివాజుగా మారిందని గంగరాజు సాయి ప్రసాద్ 9000666822 చెప్పిన విషయాన్ని బోరన్న గుర్తుచేస్తూ,గొడవలని ఆపడానికి గతంలో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారని దళిత నాయకుడు వలిగొండ శ్రీనివాస్ 9390604104,9985601449 తనకి చెప్పినట్లు ప్రజా నేస్తం బోర్ సుభాషన్న పేర్కొన్నారు.సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం వద్ద మూసీ నదిలో అక్రమ ఇసుక రవాణా 25 సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతుందని విప్లవ ప్రజా కవి శీలం స్వామి 7337292162 చెప్పారని,ఎనిమిది సంవత్సరాల్లో ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఇతర ప్రమాదాల్లోను ఎనిమిది మంది చనిపోయారని,మూడేళ్ల కిందట ఎనిమిదేళ్ల బాలుడు ఇసుకాసురులు ట్రాక్టర్ ఢీకొని మరణించాడని బోరన్న తెలిపారు.

ములుగు జిల్లా మల్యాలలో 10 మంది రైతుల భూముల్లో ఇసుక మేటలు వేయడంతో ఇక్కడ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇచ్చారని దీంతో గుత్తేదారు నకిలీ వే బిల్లులు బార్ కోడ్ లతో యదేచ్ఛగా అక్రమ తరలింపునకు పాల్పడుతున్నారని ప్రతిఘటన మాజీ దళపతి ప్రసాదన్న 9553895407 ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఘట్కేసర్ లో పోలీసుల తనిఖీల్లో నకిలీ వే బిల్లుల వ్యవహారం వెలుగులోకి వచ్చినా ఏ ఒక్కరికి శిక్షలు పడలేదని బోర సుభాషన్న తెలిపారు.భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం గోదావరి తీర ప్రాంతంలో 28 ఇసుక రేవులున్నాయని,ఇక్కడి నుంచి ఒక్క లారీలో రెండు టన్నులు అదనంగా నింపుకెళ్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని,రాత్రి వేళల్లో కొన్ని రేవుల నుంచి వే బిల్లులు లేకుండానే ఇసుక తరలిస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్న దాఖలాలు లేవని సుభాషన్న ఆరోపించారు.

సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ లో అక్రమ తవ్వకాలు అడ్డగోలుగా జరుగుతున్నాయని చేగువేరా రంజిత్ విద్యార్థి నేత 9866423892 చెప్పాడని ఫోటోలు తీసి అక్రమ ఇసుక దందాను సోషల్ మీడియాకు పంపిస్తున్నాడని ట్రాక్టర్ల యజమానులు కోపంతో కోడి రవి అనే వ్యక్తిపై దాడికి పాల్పడ్డారని బోసన్న పేర్కొన్నారు.సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మవ్వాడ మల్లాపూర్ లో మధ్య మానేరు జలాశయం కింద ప్రాంతంలో ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని విద్యార్థి నేత జార్జిరెడ్డి వారసుడు పాలడుగు శ్రీనివాస్ 9948269127 ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ప్రజా నేస్తం బోరా సుభాషన్న పేర్కొన్నారు.

సిరిసిల్ల,తంగళ్ళపల్లి మండలంలో గడ్డి లచ్చపేట,కట్కూరు పరిధిలో మావేరు వాగు నుంచి తవ్వకాలు సాగుతున్నాయని,ఇక్కడ స్థానిక ప్రజా ప్రతినిధులు,ఇసుక ట్రాక్టర్ల యజమానులు యూనియన్ గా ఏర్పడి,స్థానిక అనుమతుల పేరుతో సొమ్ము చేసుకుంటున్నారని బోరన్న ఆరోపించారు.మంచిర్యాల జిల్లాలో గోదావరి నుంచి ఇసుక తవ్వకాలను ఇష్టం వచ్చినట్లు కొనసాగిస్తున్నారని, రోజు వందలాది లారీలు అక్రమ రవాణా వ్యాపారం చేస్తున్నాయని,ఎక్స్ కావేటర్ తో ఆరు నుంచి పది ఫీట్ల లోతు తవ్వేస్తున్నారని కెసిఆర్ కు రాసిన లేఖలో ప్రజా బంధువు బోర సుభాషన్న ఆరోపించారు.

చాలా జిల్లాల్లో వాగుల నుంచి ఇసుకను యదేచ్ఛగా పట్టపగలే తరలిస్తున్నారని,ఎవరు గుర్తు పట్టకుండా ఉండేందుకు లారీలలో పైన ఇటుకలు పేర్చి లోపలంతా ఇసుక నింపుకొని దందా నడుపుతున్నారని సామాజిక కార్యకర్త నవిలే వెంకటరెడ్డి 9912142114 చెప్పాడని తెలిపారు.కొన్నిచోట్ల రెడ్ హ్యాండెడ్ గా దొరికిన ఇసుక దందాలో పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉండటంవల్ల అధికారులు,పోలీసులు, లంచాలకు చెంచాగిరి చేయడంవల్ల శిక్షలు పడటం లేదని సీఎం కేసీఆర్ కు సుభాషన్న ఫిర్యాదు చేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకాసురులు రోజుకు 24 గంటలు రెచ్చిపోయి దందా చేస్తున్నారని, అనుమతులకు మించి అక్రమ ఇసుక తవ్వకాలు కొనసాగిస్తున్నారని,అనుమతులకు మించి అడ్డగోలుగా ఇసుకను తవ్వేస్తున్నారని బహుజన హితాన్ని కోరుకునే శ్రామిక వర్గ పోరాటాల నాయకుడు కామ్రేడ్ బోర సుభాషన్న కన్నీరు పెట్టారు.ట్రాక్టర్లు, టిప్పర్లు,లారీలలో అనుమతికి మించి ఇసుకను తరలించి,పెద్ద ఎత్తున నిల్వ చేసుకుంటూ, అక్కడినుంచి పట్టణాలకు ఇసుకను తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారని బోర సుభాషన్న బోరుమని ఏడ్చారు.

ఇసుక మాఫియా తమ అక్రమ దందాతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నా నదులు, కాలువలు,చెరువులను నిర్జీవం చేస్తున్నా అధికారులు చూసిచూడనట్లుగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఇసుక తవ్వకాలు మొదలు,అమ్మకాల దాకా ప్రతి దశలో భారీగా ముడుపులు అందుతుండటం వల్లనే ప్రభుత్వ యంత్రాంగం మౌనంగా ఉంటుందని ప్రజా నేస్తం బోర సుభాషన్న ఆరోపించారు.

రాజకీయ నాయకుల,అధికారుల అండదండలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగు వాగులో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు కొనసాగిస్తున్నారని భారతీయ జనతా రాజ్యం బిజెఆర్ నాయకుడు ప్రజయ్ ప్రచండ 8328 277285 చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా బోర సుభాషన్న అభివర్ణించారు.మూడు పువ్వులు,ఆరు కాయలుగా కాదు 30 లారీలు,అరవై ట్రాక్టర్లుగా వర్ధిల్లుతూ అక్రమ వ్యాపారం చేస్తున్న ఇసుకాసురుల మాఫియాను ఇకనైనా శిక్షించాలని,అక్రమ దందాలను అరికట్టాలని, తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంతగా దొరుకుతున్న ఇసుక బంగారం దోపిడీని నిలుపుదల చేయాలని, గోరంత అనుమతులతో కొండంత తవ్వుకుంటున్న ఇసుక దొంగలపై ఉక్కుపాదం మోపాలని,రెచ్చిపోతున్న ఇసుకాసురుల భరతం పట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ను కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి బోర సుభాషన్న డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube