నాకు గొప్పలు చెప్పడం అస్సలు నచ్చదు.. రాధిక ఆప్టే షాకింగ్ కామెంట్స్!

వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన రక్త చరిత్ర అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి రాధిక ఆప్టే అందరికీ సుపరిచితమే.ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సరసన లెజెండ్,లయన్ వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు.

 I Dont Like To Say Like That Radhika Apte Shocking Comments Details, Radhika Ap-TeluguStop.com

ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరమైనప్పటికీ హిందీ సినిమాలతో ఎంతో బిజీగా ఉంటూ విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే ప్రస్తుతం లండన్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తన లండన్ ట్రిప్ గురించి అభిమానులకు తెలియజేస్తూనే రాధిక ఆప్టే సినీ ఇండస్ట్రీ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇండస్ట్రీలో కొనసాగాలంటే చాలామంది నైపుణ్యం ముఖ్యం కాదు శరీరాకృతి ముఖ్యమని భావిస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది అందంగా కనిపించడం కోసం ఎన్నో సర్జరీలు చేయించుకుంటారు.

నాకు తెలిసిన ఎంతోమంది సన్నిహితులు తనతో మాట్లాడుతూ ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే శరీరాకృతి ముఖ్యం కాదు అని చెబుతూనే సర్జరీలు చేయించుకున్న వారు చాలామంది ఉన్నారని ఈమె వెల్లడించారు.

Telugu Radhika Apte, Physique, Rakta Charitra, Telugu, Tollywood-Movie

తన దృష్టిలో సినిమా అవకాశాలకు, సర్జరీలకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపారు.తాను అలాంటివాటికి దూరంగా ఉంటానని కేవలం వృత్తిపరమైన జీవితం వరకు మాత్రమే సినిమాతో ప్రయాణం చేస్తానని అనంతరం సినిమా ప్రస్తావన కూడా తీసుకురానని ఆమె తెలిపారు.ఇకపోతే చాలా మంది హీరోయిన్స్ కాలక్షేపం కోసం కబుర్లు చెప్పుకుంటూ ఎన్నో గొప్పలు చెబుతారు.

కానీ తనకు అలా గొప్పలు చెప్పుకోవడం ఏమాత్రం నచ్చదని ఈ బోల్డ్ బ్యూటీ ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube