దివినుండి భువికి దిగివచ్చిన అతిలోకసుందరి ఆమె.హీరోలతో హీరోయిన్లకు ఎక్కడ పోటీ లేని సమయంలోనే స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ ఆమె.తెలుగు తమిళ కన్నడ భాషలు అనే తేడా లేకుండా అంతటా మకుటంలేని మహారాణిగా కొనసాగినా హీరోయిన్ ఆమె.ప్రేక్షకులందరూ ఆమెను అతిలోక సుందరి అని అంటూ ఉంటారు.దర్శకనిర్మాతలు ఆమెను అందాల యువరాణి అని పిలుస్తుంటారు.ఆమె ఎవరో కాదు శ్రీదేవి.1980లలో శ్రీదేవి భారతీయ చలన చిత్ర పరిశ్రమ తో భాషతో సంబంధం లేకుండా ఎంత హవా నడిపించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అయితే అతిలోక సుందరి శ్రీదేవి ని పెళ్లి చేసుకోవడానికి అప్పట్లో ఎంతో మంది హీరోలు దర్శకనిర్మాతలు కూడా పోటీ పడ్డారు అని చెప్పాలీ.
టాలీవుడ్ లో శ్రీదేవిని పెళ్లి చేసుకునేందుకు సిద్దపడి ఆ తర్వాత క్యాన్సిల్ చేసుకున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.అప్పట్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న మురళీమోహన్ శ్రీదేవినీ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది.
అప్పుడే ఇండస్ట్రీలో బాగా క్లిక్ అవుతున్న మురళీమోహన్ శ్రీదేవిని పెళ్లి చేసుకోవడానికి మాత్రం నో చెప్పేశాడట.

అప్పట్లో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా గుర్తింపు సంపాదించుకున్న రాజశేఖర్ ను శ్రీ దేవి తల్లి నా కూతురు పెళ్లి చేసుకో అని స్వయంగా అడిగిందట.కానీ అప్పట్లో కెరియర్ పరంగా బిజీగా ఉండడంతో రాజశేఖర్ శ్రీదేవితో వివాహానికి నో చెప్పారట.బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత మిధున్ చక్రవర్తి తో ప్రేమలో పడింది అతిలోకసుందరి.
దీంతో వీరు మరికొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరిగింది.

కానీ మొదటి భార్యను వదిలేస్తేనే శ్రీదేవినీ ఇచ్చి పెళ్లి చేస్తానని తల్లి కండిషన్ పెట్టడంతో మిధున్ చక్రవర్తి శ్రీదేవి పెళ్లి క్యాన్సిల్ అయింది.ఆ తర్వాత కాలంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా నిర్మాత బోనీ కపూర్ ను ప్రేమించి హడావిడిగా రహస్యంగా పెళ్లి చేసుకుంది శ్రీదేవి.







