ఆ ఆరోగ్య కేంద్రంలో అంతా మా ఇష్టం...!

నల్లగొండ జిల్లా:ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,కమ్యూనిటీ హెల్త్ సెంటర్,బస్తీ,పల్లె దవాఖానలు ఏర్పాటు చేస్తే, అందులో ప్రజలకు వైద్యం సేవలు అందించాల్సిన డాక్టర్స్,ఇతర సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తూ సమయ పాలన పాటించకుండా అంతా మా ఇష్టం అడిగేదెవర్రా అన్న రేంజ్విధులు విర్వహిస్తున్న తీరు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.

వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా( Nalgonda District ) త్రిపురారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( Primary Health Centre )లో పని చేస్తున్న వైద్యాధికారితో సహా స్టాఫ్ నర్స్,పార్మసిస్ట్,ల్యాబ్ టెక్నిషియన్ ఎప్పుడు వస్తారో, ఎప్పుడు పొతారో తెలియక, వివిధ అనారోగ్య కారణాలతో ఆసుపత్రి వద్ద ఎదురు చూపులు చూస్తూ పడిగాపులు కాస్తున్నారు.

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తెరిచి ఉంచాలని నిబంధన ఉన్నప్పటికీ ఇక్కడ పని చేసే వారికి అవేవి పట్టకపోవడంతో తమ ఆరోగ్య సమస్య తీరుకుందని ఆశగా ఆసుపత్రికి వచ్చే రోగులు ఖాళీ కుర్చీలను చూసి నిరాశగా వెనుతిరిగి పోతున్నారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుదవారం ఉదయం 9 నుండి 10 గంటల వరకు పరిశీలించగా సిబ్బంది ఎవరూ విధులకు హాజరు కాకపోవడంతో వైద్య సేవల కోసం వచ్చిన రోగులు వెళ్ళిపోయారు.అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్,ల్యాబ్ టెక్నీషియన్, వైద్యాధికారి అందుబాటులో లేరు,సరే ఒక పది పదిహేను నిమిషాలు ఆలస్యంగా వచ్చిందంటే అది కూడా లేదు.10 గంటల వరకు కూడా ఎవరూ రాలేదు.ఆ తర్వాత వచ్చారా లేదా అనేది ఆ శాఖా ఉన్నతాధికారులకే తెలియాలి.

ఇదిలా ఉంటే వైద్యాధికారి డాక్టర్ శంకర్( Dr.Shankar) మాత్రం ప్రతీ రోజూ కరెక్ట్ సమయానికి వస్తామని,నిన్న ఒక్క రోజే కొద్దిగా అరగంట ఆలస్యమైందని చెప్పడం గమనార్హం.అయితే డాక్టర్ చెప్పిన మాటలకు,చేతలకు పొంతనలేని విధంగా ఉందని, 9:30 కు కాదు 10 దాటిన ఎవరూ హాజరుకాలేదని స్థానికులు అంటున్నారు.

గుర్రంపోడు మండలం మొసంగిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
Advertisement

Latest Nalgonda News