మిర్యాలగూడలో సస్పెన్షన్ పాలిటిక్స్

నల్లగొండ జిల్లా:పార్లమెంట్ ఎన్నికలు( Parliament Elections) సమీపిస్తున్న తరుణంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ( Miryalaguda ) రాజకీయం సస్పెన్షన్ థ్రిల్లర్ ను తలపిస్తుంది.శనివారం ఉదయం హైదారాబాద్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్,12 మంది కౌన్సిలర్లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరారు.

 Politics Of Suspension In Miryalaguda, Parliament Elections, Miryalaguda ,deepa-TeluguStop.com

అది కాస్తా సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో మధ్యాహ్నం పట్టణంలో వీరి చేరికను వ్యతిరేకిస్తూ వాల్ పోస్టర్లు వెలిశాయి.దీనితో రాష్ట్ర హై కమాండ్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా చేరికను నిలిపివేస్తున్నట్లు దీపా దాస్ మున్షీ ఆదేశానుసారం ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్( MLC Mahesh Kumar Goud ) పేరుతో ప్రెస్ నోట్ విడుదల చేశారు.

కానీ,ఈ లోపే చేరిక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అసలు వీరు కాంగ్రెస్ లో చేరినట్లా చేరనట్లా అని జిల్లాలో రాజకీయ ఉత్కంఠకు తెరలేచింది.

ఇంతలోనే శనివారం సాయంత్రం మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లడుతూ తనకు, స్థానిక ఎమ్మెల్యేకు తెలియకుండా చేరికలు ఉండవని,భార్గవ్ ఆయన అనుచరుల చేరిక చెల్లదని వెల్లడించారు.ఇకపై ఎలాంటి చేరికలు ఉన్నా స్థానిక ఎమ్మెల్యేకు గానీ,నాకు గానీ తెలియకుండా చేరిక చేయవద్దని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) దృష్టికి తీసుకువెళ్తానన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి,పొదిల శ్రీను తదితరులు పాల్గొన్నారు.దీనితో మున్సిపల్ చైర్మన్ భార్గవ్ అయన అనుచరుల భవితవ్యం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మున్సిపల్ మాజీ చైర్మన్లు మెరుగు రోషయ్య,తిరునగరు నాగలక్ష్మి,వార్డు కౌన్సిలర్లు బంటు రమేష్,మాలోతు రాణి, కర్నె ఇందిర,పత్తిపాటి సంజాత,ఉదయ్ భాస్కర్, సాధికాబేగం,ఉబ్బపెల్లి వెంకమ్మ,అమృతం దుర్గ, దేవకమ్మ,చీదెళ్ల సత్యవతి, మలగం రమేష్,అబ్దుల్ సలీం, బండి శ్రీనివాస్,సైదిరెడ్డి,ఖాదర్, నవాబ్,ఉబ్బపల్లి మధు, అమృతం సత్యం,లింగారెడ్డి తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube