నల్లగొండ జిల్లా: అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడుకుందామని ప్రభుత్వ దవాఖానకు ప్రాణాలు పోవడం ఖాయమని జనసేన దేవరకొండ ఇంఛార్జి చందు నాయక్ అన్నారు.నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని తాటికల్ గ్రామపంచాయతీ రేగుల తండాకు చెందిన రమావత్ జాను మనస్థాపానికి గురై పురుగుల మందు తాగడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ వ్యక్తి మరణించాడు.ఈ విషయం జనసేన పార్టీ ఇంచార్జ్ చందు నాయక్ కు సమాచారం ఇవ్వడంతో హటాహుటిన వచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వహించినటువంటి విషయాన్ని తెలుసుకొని సిసి ఫుటేజ్ లు చెక్ చేయగా డాక్టర్ నిర్లక్ష్యం చేశారని తెలిసింది.
డాక్టర్లను నిలదీయగా సరిగా సమాధానం ఇవ్వకపోవడంతో డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.అనంతరం ఆయన మాట్లాడుతూ దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కడుపులో నుంచి విషయం బయటికి తీయడమే తప్ప కనీసం వెంటిలేటర్ గాని ఆక్సిజన్ గాని అందించకపోవడమే కాదు అంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి సదుపాయాలు లేకపోవడం బాధాకరం అన్నారు.
పురుగుల మందు తాగిన తర్వాత అది ఒంటికి పాకిన తర్వాత ఆయాసంతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు.
అలాంటి వ్యక్తులకు ఆక్సిజన్ వెంటిలేటర్లు చాలా అవసరమని ప్రభుత్వ ఆసుపత్రిలో అలాంటి సదుపాయాలు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు.
ఈ విషయం పైన అధికారులు ఆరా తీయాలని,వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు గాని అక్కడున్న సిబ్బంది కానీ, వచ్చిన రోగులపైన డబ్బులు వసూలు చేయడం,వాళ్ల పైన జరుగుతున్న భౌతిక దాడులు గిరిజన పేద ప్రజలపైన నిర్లక్ష్యం ఏ విధమైన వహిస్తున్నారనే విషయం పూర్తి సమాచారంతో కమిషనర్ అజయ్ కుమార్ కి తెలియజేస్తానని చెప్పారు.
దేవరకొండ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు ఏ విధమైన హాని జరిగినా సహించేది లేదన్నారు.ఎంత పెద్ద అధికారైనా అతనిపైన ఒత్తిడి తీసుకోరాటం ఖాయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో రామావత్ మల్లేష్ నాయక్,రమావత్ రాజేష్ నాయక్,సంఘు నాయకులు తదితరులు పాల్గొన్నారు.