నల్లగొండ జిల్లా:దామరచర్ల గిరిజన గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కవితను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.నవంబరు 28న గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖి చేసిన సమయంలో ప్రిన్సిపాల్ విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడం,పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య లోపం, అపరిశుభ్రమైన వంట పాత్రల్లో వంట చేయడం చూసి కలెక్టర్ సీరియస్ అయ్యారు.
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన పాఠశాల ప్రిన్సిపాల్ కవితను సస్పెండ్ చేస్తూ అలాగే హాస్టల్ వార్డెన్ నసీర్ బేగం కు షోకాజ్ నోటీసులు అందజేశారు.అలాగే పాఠశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా నాగవసంతను నియమించినట్లు డిసిఓ లక్ష్మయ్య తెలిపారు.