యాదాద్రి భువనగిరి జిల్లా:హైద్రాబాద్ అంబేద్కర్ లా కాలేజీలో మూడో సంవత్సరం న్యాయవిద్య చదువుతున్న ఇస్లావత్ శ్రావ్య అనుమానస్పద మృతికి కారణమైన నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.శనివారం జిల్లా కేంద్రంలో ఆయన శనార్తితో మాట్లాడుతూ మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న ఆకృత్యాలను,న్యాయ విద్యార్థిపై జరిగిన దమనకాండను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షుడు కుక్కదూవ సోమయ్య,తడక మోహన్,పాల్వంచ జగతయ్య,సహాయ కార్యదర్శి బోల్లెపెల్లి కుమార్,సీసా శ్రీనివాస్, చింతల రాజశేఖర్ రెడ్డి, బొడ్డు కిషన్,నేహాల్ తదితరులు పాల్గొన్నారు.