నల్లగొండ జిల్లా:దేశ వ్యాప్తంగా కోడిగుడ్ల ధరలు పెరిగాయి.హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.5.90గా NECC నిర్ణయించింది.దీంతో రిటైల్ మార్కెట్లో రూ.6.50 నుంచి రూ.7 వరకు అమ్మే అవకాశం ఉంది.చలి కాలంలో గుడ్డు వినియోగం పెరగడం,క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం కేకుల తయారీలో వాడనుండటంతో రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది.మున్ముందు ధర మరింత పెరగవచ్చని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Latest Nalgonda News