యాదాద్రి భువనగిరి జిల్లా: డిసెంబర్ 14న జరిగే లోక్ అదాలత్ ను కాక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని చౌటుప్పల్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మహాతి వైష్ణవి అన్నారు.యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కోర్టులో శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ సత్వర కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి అవకాశమని తెలిపారు.
కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని,రాజీ మార్గం ద్వారానే సమస్యల పరిష్కార రాజ మార్గం దొరుకుతుందని అన్నారు.అదేవిధంగా ఎక్కువ మొత్తంలో కేసుల పరిష్కారానికి పోలీసు అధికారులు,న్యాయవాదులు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బార్ సోసియేషన్ అధ్యక్షుడు ఉడుగు శ్రీనివాస్ గౌడ్, సహాయ కార్యదర్శి జల్లా రమేష్,కల్చరల్ సెక్రటరీ మొత్తం నరసింహ,కమిటీ సభ్యులు జగతి శేఖర్, న్యాయవాదులు ఎలమొని శ్రీనివాస్,తడక మోహన్,బాల్యం వెంకటచలపతి,గంగాదేవి రవీందర్,పరమేష్, చామట్ల జంగయ్య,ఎండి ఖయ్యూం పాషా,పోలీసు అధికారులు,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.