డిఎం అండ్ హెచ్ఓ ఆఫీసులో భారీగా లావాదేవీలు..!

నల్లగొండ జిల్లా:జిల్లా కేంద్రంలోని డీఎం అండ్ హెచ్ఓ కార్యాలయం అవినీతికి నిలయలంగా మారింది.అమ్యామ్యాలతో అనుకున్న వారికి డిపిఓ పోస్టును కట్టబెట్టి అందలం ఎక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

 Huge Transactions In Dm&ho Office , Dm&ho Office , Huge Transactions-TeluguStop.com

సుమారు 6 లక్షలకు డిపిఓ పోస్ట్ కోసం బేరమాడినట్టు విశ్వనీయ సమాచారం.గతంలో డిపిఓగా పనిచేసిన వ్యక్తి రాజీనామా కారణంగా ఖాళీ అయిన పోస్టుకు ఈనెల 18న నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు.

ముందుగానే ప్రణాళికల ప్రకారం బేరమాడుకున్న వ్యక్తికి ఇచ్చే విధంగా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి ప్లానింగ్ చేసుకుని,తూతూ మంత్రంగానే నోటిఫికేషన్లు ఇచ్చి,ఆఫీసులో ఎప్పటినుంచో పనిచేస్తున్నాడని దానిని లెక్కలు తీసుకొని 25 కు 25 మార్కులు వేశారు.ఒక ఉద్యోగానికి వన్ ఈస్ట్ 30 ప్రకారం 30 అభ్యర్థుల ఇంటర్వ్యూకు పిలుపు, అభ్యర్థులకు సమాచారం ఇవ్వకుండానే ఆ వ్యక్తికి ముందుగానే ఎగ్జామ్ ప్రిపేర్ చేయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇంటర్వ్యూకు అన్ని తానే ముందుండి నడిపించిన డీఎంహెచ్ఓ.ఈ వ్యవహారంలో ఆఫీసులోనే ఓ ఉద్యోగి సెలెక్ట్ అయిన వ్యక్తి డిఎంహెచ్ఓ మధ్యల రాయబారిగా వ్యవహరించినట్టు,తూతూ మంత్రంగానే నోటిఫికేషన్ ఇచ్చి అనుకున్న వ్యక్తికే ఇచ్చేటట్టు ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

తమ ఆఫీసులోనే కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఒక వ్యక్తితో బేరమాడుకొని డిపిఓ పోస్టును ఇచ్చేందుకు అక్టోబర్ నెలలోనే ఆ ఆఫీసులోనే పనిచేస్తున్న వ్యక్తికి డిపిఓ పోస్టింగ్ ఇప్పించే ప్రయత్నం చేశారు.ముందుగానే తయారుచేసిన నోట్ ఫైల్ కలెక్టర్ ఆఫీస్ కు పంపించే ప్రయత్నం చేశారు.

ఆ నోట్ ఫైల్ ను గమనించిన స్టాఫ్ సిబ్బంది అలా ఎలా ఉద్యోగం ఇస్తారని ఆ నోట ఈ నోట డిఎంహెచ్ఓపై పలువురు ఉద్యోగస్తులు ఆరోపణ తెలపటంతో నోట్ ఫైల్ ను వెనక్కి తీసుకొని నోటిఫికేషన్ విడుదల చేశారు.నోటిఫికేషన్ వేసి కేవలం నాలుగు రోజులు సమయం ఇచ్చారు.

అందులో రెండు రోజులు సెలవు కావడంతో సమయం తక్కువ ఉండటంతో నోటిఫికేషన్ కి కేవలం 30 మంది అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకున్నారు.డీఎంహెచ్ఓ అనుకున్న ప్రణాళిక ప్రకారంగానే బేరమాడుకున్న వ్యక్తికి ముందుగానే పరీక్షను ఏ విధంగా రాయాలో ప్రిపేర్ చేసి మిగతా వారితో కలిసి పరీక్షను పెట్టారు.

అయినా గాని ఆ వ్యక్తికి మెరిట్లో కనిపించని ఇయర్ ఆఫ్ పాసింగ్,సెలెక్ట్ అయిన అభ్యర్థికి లిస్టులో 9వ స్థానం ఉన్నా గాని అన్ని అర్హతలు కలిగినట్టుగా సేకరించి పోస్టు ఇస్తున్నట్లు సమాచారం.ఆఫీస్లో పనిచేసే వారిని ముందువరుసలో పెట్టడం ఏమిటి? అసలెందుకు దరఖాస్తులు స్వీకరించారు.వారికే ఇచ్చు కోవచ్చు కదా అంటూ అభ్యర్థులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు.ఈ విషయం డిఎంహెచ్ఓ సిబ్బందికి తెలియడంతో తన ఛాంబర్ లో సిబ్బంది ని పిలిపించుకొని అందరికీ వార్నింగ్ చేశాడని,ఎవరు ఎన్ని అడ్డంకులు తెచ్చిన ఆ వ్యక్తికి పోస్టింగ్ ఇప్పించే తీరుతానని రుబాబు చేశాడని పలువురు సిబ్బంది ఆరోపణ చేశారు.

లిస్టులో ఉన్న మొదటి ముగ్గురు అన్ని అర్హతలు కలిగిన గాని తొమ్మిదవ స్థానం ఉన్న వ్యక్తికి పోస్టు సిఫార్సు చేసినట్టు అనుమానాలకు దారి తీస్తున్నాయి.ఏఎన్ హెచ్ఎం గైడ్లైన్స్ ప్రకారం జిల్లా ప్రాజెక్టు అధికారి (డిపిఓ) పోస్టును భర్తీ చేయాలని అంటున్నారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుండి తయారుచేసిన గైడ్లైన్స్ కాకుండా అనుభవం, అర్హతలు ఉన్న వారితో భర్తీ చేయాలని కోరుతున్నారు.ఇప్పటికైనా జిల్లా వైద్య శాఖ అధికారులు,సిబ్బంది అనర్హులను అందలం ఎక్కిస్తారా? అర్హులతో భర్తీ చేస్తారా? అన్నది వేచి చూడాల్సిందే.నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ చొరవచూపి జిల్లాపోస్టు ఎంపికలో నిబంధనలు పాటించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.డిఎంహెచ్ఓ పుట్టా శ్రీనివాస్ వివరణ కోరగా అలా ఏమీ జరగలేదని,జిల్లా కలెక్టర్ పరీక్షలు నిర్వహించి డిపిఓ పోస్టు ఖరారు చేశారని తెలిపడం గమనార్హం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube