నల్లగొండ జిల్లా: సాధారణంగా జిల్లా కేంద్రంలో జిల్లా పరిపాలనా విభాగాలు మొత్తం కలెక్టరేట్ నుండి ప్రారంభమవుతాయి.కలెక్టరేట్ ఎప్పుడు అధికారులతో,ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే ప్రదేశం.
ఆ ప్రదేశంలో వైన్స్ ఇతర వ్యాపార సంస్థలు నిర్వహించడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారన్న సందేహం ప్రజల్లో వ్యక్తం అవుతుంది.శ్రీ దుర్గా వైన్స్ కలెక్టరేట్ పక్కన మెయిన్ రోడ్డు మీదనే ఉండడం, కలెక్టరేట్లో ప్రజావాణికి,వివిధ కార్యాలయాలకి వచ్చే దరఖాస్తుదారులు, వారి వాహనాల తాకిడి, రోడ్డుపై పార్కింగ్,రోడ్డు పొడవునా మనుషులు నిలబడి ఉండడం,వైన్స్ షాపు కలెక్టరేట్ పక్కనే ఉన్న వైన్స్ కి మద్యం కొనుగోలు కోసం వచ్చే మందుబాబులు ఎక్కువ సంఖ్యలో వైన్స్ ముందు నిలబడడంతో ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు.
అంతేకాకుండా నడిచి వచ్చే మహిళలు,విద్యార్ధినుల పట్ల మందుబాబుల వెకిలి చూపులు ఇబ్బందికరంగా ఉందని వాపోతున్నారు.కలెక్టరేట్ కి ఎదురుగా మహిళా పోలీస్ స్టేషన్ ఉండడం,నిత్యం ఏదో ఒక కుటుంబ సమస్యతో పోలీస్ స్టేషన్ కి వచ్చేవాళ్ళు.
దానికి ఎదురుగానే మీసేవ, జిరాక్స్ సెంటర్లు,ఇతర వ్యాపార సంస్థలు కూడా ఉండడంతో వ్యాపార అవసరాల నిమిత్తం వచ్చే వారు,వారి వాహనాలు, కలెక్టరేట్ పక్కనే ఆర్టీవో ఆఫీస్ కి వెళ్లే దారి ఉండడం,వివిధ రకాల ఇతర వ్యాపార సంస్థలు ఉండటం వల్ల ఈ దారి కూడా ఎప్పుడూ రద్దీగా ప్రజలతో ఉంటుంది.
ఎప్పుడూ వాహనాలతో, కాలినడకదారులతో రోడ్లు రద్దీగా ఉండడం వలన వివిధ వ్యాపార సంస్థల నిమిత్తం దరఖాస్తుదారులు రోడ్డుకు అడ్డంగా నిలబడడం వలన వాహనాలు ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడం వలన వాహన చోదకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు.
సాయంత్రం 6 గంటలకు హాస్టల్ కి వెళ్లే విద్యార్థులు ఈ ప్రాంతం నుండే కాలినడకతో వెళ్లాలి.సాయంత్రం కాగానే ఆ రద్దీగా ఉండే జనాలను చూసి,విద్యార్థినిలు,ఏదో ఒక అవసరానికి బయటికి వెళ్లే వారి కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
అసలే రద్దీ ప్రాంతం,అధిక మొత్తంలో జన సమూహాలు,రోడ్డుకు అడ్డంగా వాహనాల పార్కింగ్,పక్కనే వైన్స్ ఉండడంతో ప్రతీ ఒక్కరూ ఇబ్బంది పడుతున్నారు.
ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరుతున్నారు.
అదేవిధంగా మిథిలా నగర్ కి,జూబ్లీహిల్స్ కాలనీకి, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళకి, హాస్టల్ కి,ఇందిరమ్మ కాలనీకి వెళ్లాలంటే సాయంత్రం ఆరు కాగానే సరియైన వీధిలైట్లు లేకపోవడం వలన రోడ్డు మీదనే ఉన్న జనాలను చూసి విద్యార్థిని విద్యార్థులు భయపడుతున్నారు.కలెక్టరేట్ పక్కనే జనాలు భయపడవలసిన పరిస్థితి వస్తే సామాన్య వీధులలో జనాల పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
దీనిపై అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.