నల్గొండ జిల్లా:నాగార్జున సాగర్ విజయపురి నార్త్ ఎస్సై రాంబాబు,వ్యవసాయ అధికారి సందీప్ తో కలిసి గురువారం నందికొండలోని పలు ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయా దుకాణాల్లో స్టాక్‌ను,రిజిష్టర్లను పరిశీలించారు.
అనంతరం వారు మాట్లాడుతూ నకిలీ పత్తివిత్తనాలు అమ్మితే దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేస్తామని హెచ్చరించారు.రైతులకు ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలను మాత్రమే అమ్మాలని సూచించారు.
విత్తనాలు,ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు.షాపు లైసెన్సులను బహిరంగంగా ఉంచాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
గుర్తు తెలియని వ్యక్తులు లూజ్ పత్తి విత్తనాలు అమ్మడానికి వస్తే వ్యవసాయ శాఖ,పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.నకిలీ బార్కోడ్,నకిలీ విత్తనాలను విక్రయించిన యెడల పిడి యాక్ట్ చట్టం కింద కేసులు నమోదు చేస్తామని తెలిపారు.