నల్లగొండ జిల్లా: 2023 ఎన్నికల్లో 12 స్థానాలకు 11 స్థానాల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం కాంగ్రెస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు.కాంగ్రెస్ జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
బాణసంచా కాలుస్తూ,స్వీట్స్ పంచుకుంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉండి అధికార పార్టీ ఆగడాలకు అట్టుడికిపోయిన నాయకులు, కార్యకర్తలు
కాంగ్రెస్ పార్టీ సాధించిన అఖండ విజయంతో ఆనందం కట్టలు తెంచుకుని డాన్స్ లు చేశారు.
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని ప్రయత్నాలు చేసినా, విచ్చలవిడిగా డబ్బులు పంచినా గెలవలేకపోయారని, నిరంకుశ పాలన సాగించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పలేదని కాంగ్రెస్ నేతలు అన్నారు.సూర్యాపేటలో మంత్రి జగదీష్ రెడ్డి గెలుపు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడేదని, కానీ,టిక్కెట్ ప్రకటించడంలో ఆలస్యమే కొంప ముంచిందని భావిస్తున్నారు.