కల్తీ పాలు తయారు చేస్తున్న వ్యక్తుల అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లా:వేసవి కాలంలో పాల ఉత్పత్తి తక్కువగా ఉండడం,పాల అవసరాలు ఎక్కువగా ఉండడంతో అధిక డబ్బులు సంపాదించాలనే అత్యాశతో పాలను కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ముగ్గురు కేటుగాళ్లపై రూరల్ మరియు ఎస్ఓటి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసిన ఘటన యాదాద్రి జిల్లాలోని భువనగిరి రూరల్ మండలం వడపర్తి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…వనపర్తి గ్రామానికి చెందిన మేడబోయిన మహేష్,మేడబోయిన బాలయ్య, మేడబోయిన శ్రీశైలం అనే ముగ్గురు వ్యక్తులు గ్రామంలో రైతుల దగ్గర పాలు సేకరించి ఇతర ప్రాంతాల్లోని హోటళ్లకు పాలను సరఫరా చేసేవారు.

 Arrest Of Persons Making Adulterated Milk-TeluguStop.com

ఈ మధ్యకాలంలో హోటల్ వారు పాలు ఎక్కువగా సప్లై చేయాలని అనడంతో పాలను కల్తీ చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో పోలీసులు దాడి చేసి వారి వద్ద నుండి 300 లీటర్ల ఉన్న కల్తీపాలు, 500 మిల్లీ లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్,200 మిల్లీ లీటర్ల ఆక్సి టోలిన్ బాటిల్,ఒక కేజీ డాల్ ఫర్ మిల్క్ పౌడర్,పది ప్లాస్టిక్ క్యాన్లు,ఒక స్టీల్ క్యాన్, మరొక స్టీల్ క్యాన్ లో ఉన్న పాలను స్వాధీనం చేసుకున్నారు.ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube