ఖమ్మం జిల్లా నేలకొండపల్లి,ముదిగొండ మండలాల ల్లో అటవీశాఖ లో ఎఫ్ఎస్ఓ గా పనిచేస్తున్న కవిత అనే అధికారిణి ని ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.నేషనల్ హైవే రహదారి నిర్మాణం లో భాగంగా చెట్లను నరికెందుకు ప్రమీల అనే కాంట్రాక్టర్ వద్ద నుంచి లక్షల్లో లంచం తీసుకోవడమే కాక, నరికిన చెట్లను తరలించే సమయంలో సైతం డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెట్టడం తో ఆ మహిళా కాంట్రాక్టర్ అటవీశాఖ అధికారులకు పిర్యాదు చేసింది.
పిర్యాదు పై విచారణ చేపట్టిన వారు నిజమే అని తేలడంతో ఎఫ్ ఎస్ ఓ కవితను సస్పెండ్ చేశారు.ఇదే విషయంలో మరికొందరు అటవీశాఖ అధికారులపై వేటు పడనునట్లు విశ్వసనీయ సమాచారం.







