కొలువుదీరిన కొత్త డిఎస్పీలు

నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు కొత్త డిఎస్పీలు కొలువుదీరారు.నల్గొండ డీఎస్పీగా వరాల నర్సింహారెడ్డి,కోదాడ డిఎస్పీగా వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

 New Dsps Acquired-TeluguStop.com

ఇప్పటివరకు నల్లగొండ డిఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వర్‌రెడ్డి కోదాడకు బదిలీపై వెళ్లారు.హైదరాబాద్‌ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న నర్సింహారెడ్డి నల్లగొండకు వచ్చారు.

నర్సింహారెడ్డి మేడ్చల్‌ మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన ఈయన 1996 బ్యాచ్‌ ఎస్సై.హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని వివిధ విభాగాల్లో ఎక్కువగా పనిచేశారు.2014 నుంచి రెండేళ్లపాటు సూర్యాపేట సీఐగా పనిచేసిన అనుభవం ఉంది.ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ పైస్థాయి అధికారుల సూచనలతో సిబ్బందితో కలిసి నేరాల అదుపునకు కృషిచేస్తానని తెలిపారు.

అనంతరం జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిని మర్యాద పూర్వకంగా కలిశారు.కోదాడ నూతన డీఎస్పీగా వెంకటేశ్వర్‌రెడ్డి నియామకమయ్యారు.ఆయన ఇప్పటి వరకు నల్గొండ డీఎస్పీగా విధులు నిర్వర్తించారు.ఇక్కడ పని చేసిన డీఎస్పీ రఘు తొర్రూర్‌కు ఇటీవల బదిలీ అయ్యారు.

ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.గతంలో సూర్యాపేట రూరల్‌ సీఐగా పని చేసిన వెంకటేశ్వర్ రెడ్డి పదోన్నతిపై నల్గొండలో డీఎస్పీగా విధులు నిర్వర్తించి,అనంతరం డీఎస్పీగా మళ్లీ ఈ జిల్లాకు రావడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube